E-Paper
Advertisement

టీవీఎస్ To బజాజ్.. దేశంలో అత్యంత నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

టీవీఎస్ To బజాజ్.. దేశంలో అత్యంత నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ మెయింటెనెన్స్  ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో చాలా మంది ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మార్కెట్లో ఎన్నో మోడళ్లు అందుబాటులో ఉండటంతో ఏ స్కూటర్ కొనాలి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. విశ్వసనీయత, పర్ఫార్మెన్స్, సర్వీస్ నెట్‌ వర్క్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్రాండ్లు వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టీవీఎస్ ఐక్యూబ్

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ ఒకటి. టీవీఎస్ బ్రాండ్‌ పై వినియోగదారులకు ఉన్న నమ్మకం ఈ స్కూటర్ సక్సెస్ కు ప్రధాన కారణం. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లలో లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి 94 కిలోమీటర్ల నుంచి 212 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ధరలు రూ.94,999 నుంచి ప్రారంభమై రూ.1.61 లక్షల వరకు ఉంటాయి.

⦿ ఏథర్ రిజ్టా

Advertisement

కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్కూటర్ ఏథర్ రిజ్టా. పెద్ద సీటు, లేటెస్ట్ ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ దీని ప్రత్యేకత. ఒకే ఛార్జ్ తో గరిష్టంగా 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ధరలు రూ.1.04 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు ఉన్నాయి.

⦿ బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బలమైన మెటల్ బాడీతో ప్రత్యేక గుర్తింపు పొందింది. మంచి  బిల్డ్ నాణ్యత, ఆకట్టుకునే డిజైన్, విశ్వసనీయత అసలు బలాలు. వేరియంట్‌ ను బట్టి 113 నుంచి 151 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. దీని ధర రూ.89,500 నుంచి ప్రారంభమై రూ.1.22 లక్షల వరకు ఉంటుంది.

⦿ హీరో విడా

Advertisement

హీరో మోటోకార్ప్ అందిస్తున్న విడా సిరీస్ కూడా మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. V2, VX2 మోడళ్లతో మార్కెట్లో ఉన్న ఈ స్కూటర్లు సరసమైన ధరలో లేటెస్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి. పోర్టబుల్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 92 నుంచి 165 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ధరలు రూ.73,850 నుంచి రూ.1.40 లక్షల వరకు ఉన్నాయి.

⦿ సుజుకి ఈ యాక్సెస్

సుజుకి ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ యాక్సెస్ కూడా నమ్మకమైన బ్రాండ్ నుంచి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. 3.072 kWh బ్యాటరీతో ఇది ఒకే ఛార్జ్‌పై సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రారంభ ధర రూ.1.88 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

మొత్తంగా నమ్మకం, సర్వీస్ నెట్‌ వర్క్, పనితీరు పరంగా చూస్తే టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్, హీరో విడా, సుజుకి ఈ యాక్సెస్ లాంటి స్కూటర్లు మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. బడ్జెట్, రోజువారీ ప్రయాణ అవసరాలను బట్టి వీటిలో సరైన మోడల్‌ ను తీసుకోవచ్చు.

Read Also: టెసరాక్ట్ విడుదల మరింత ఆలస్యం.. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×