E-Paper
Advertisement

Triumph 350cc Motorcycles: ట్రయంఫ్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఏప్రిల్ లో 350cc బైక్స్ లాంచ్!

Triumph 350cc Motorcycles: ట్రయంఫ్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఏప్రిల్ లో 350cc బైక్స్ లాంచ్!
Advertisement

Triumph 350cc Motorcycles Launch:  ట్రయంఫ్ ఇండియా సరికొత్త బైక్స్ ను లాంచ్ చేయబోతోంది. ఏప్రిల్ నెలలో న్యూ రేంజ్ 350cc బైక్‌లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ మేరకు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కీలక ప్రకటన చేశారు. 350cc కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్ల మీద భారీగా జీఎస్టీ పడుతుంది. ఈ నేపథ్యంలో భారీ పన్నుల నుంచి మినహాయింపు పొందేందుకు ట్రయంఫ్ ఇండియా 350cc రేంజ్ బైక్‌ లను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ లిస్టులో ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఉన్నాయి.

ఏప్రిల్ లో 350cc బైక్స్ లాంచ్

రాబోయే 350cc ప్లాట్‌ ఫారమ్ పై స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400, స్పీడ్ T4లతో సహా పలు బైక్స్ రూపొందబోతున్నాయి. ఈ బైక్స్ ను ట్రయంఫ్ కంపెనీ భారత్ లోనే తయారు చేసింది. కొత్త 350cc ఇంజిన్ తప్పనిసరిగా ట్రయంఫ్ 400 శ్రేణిలో కనిపించనుంది.  అయితే, క్యూబిక్ సామర్థ్యాన్ని తగ్గించడానికి తగ్గించబడిన బోర్‌ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో, స్ట్రోక్ కూడా అలాగే ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. 350cc ఇంజిన్లు తక్కువ, మధ్యస్థ శ్రేణి టార్క్‌ లలో మరింత ఉపయోగకరమైన స్ప్రెడ్ టార్క్‌ తో విభిన్నమైన లక్షణాన్ని కలిగి ఉండబోతున్నాయి.

మరింత తగ్గనున్న ట్రయంఫ్ 350cc బైక్స్ ధర

Advertisement

ట్రయంఫ్ 350cc రేంజ్ బైక్స్ ప్రారంభించడం ద్వారా కంపెనీ బైక్‌ల ధరలను మరింత తగ్గించే అవకాశం ఉంది. 350cc బైక్‌లు ప్రారంభించిన తర్వాత 400cc బైక్ లను నిలిపివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, వీటి ఉత్పత్తిని నిలిపివేయకుండా, కొనసాగిస్తుందని తెలుస్తోంది. వాటిని ఇండియాలో అమ్మకుండా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read Also: TVS టాంజెంట్ RR కాన్సెప్ట్ డిజైన్‌కు పేటెంట్, అపాచీ RR 450కు అదే డిజైన్ వాడుతారా?

Advertisement

ఇండియాలో తమ కంపెనీకి చెందిన బైక్స్ ధర తగ్గించాలనే ఉద్దేశంతోనే 350cc బైక్స్ ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. మొత్తంగా ట్రయంఫ్ లవర్స్ ఇకపై తక్కువ ధరకే క్రేజీ బైక్స్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 50cc బైక్‌ లు రూ. 2.20 లక్షల నుండి రూ. 2.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌లు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా అందుబాటులోకి రానున్నాయి.

Read Also:  కొత్త దేశీ కారు బ్రాండ్ వచ్చేస్తోంది, అట్టహాసంగా JSW మోటార్స్ అనౌన్స్ మెంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×