E-Paper
Advertisement

Trending Scooters January 2026: బజాజ్ To హోండా.. 2026 ట్రెండింగ్స్ బైక్స్ ఇవే!

Trending Scooters January 2026: బజాజ్ To హోండా.. 2026 ట్రెండింగ్స్ బైక్స్ ఇవే!
Advertisement

దేశీ మార్కెట్లోకి సూపర్ డూపర్ స్కూటర్లు అడుగు పెడుతున్నాయి. పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. బజాజ్, టీవీఎస్, హోండా, హీరో, యమహా సహా పలు స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. జనవరి 2026లో టాప్ ట్రెండింగ్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ బజాజ్ చేతక్  

ప్రస్తుతం దేశంలో మోస్ట్ పాపులర్ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది. జనవరి 14, 2026న అప్ డేటెడ్ వెర్షన్ లో విడుదల కాబోతోంది. స్టైలిష్‌ లుక్ లో ఆకట్టుకోనుంది. ధర పరంగానూ ఆకర్షణీయంగా ఉంది. దీని ధర రూ. 1.07 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 3kwhతో పాటు 3.5 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో రానుంది. ఫుల్ ఛార్జ్ తో సుమారు 130 కిలో మీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. ఇందులో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. టీఎఫ్టీ డిస్ ప్లే, యాప్ కనెక్టివిటీ, టక్ స్క్రీన్, మెటల్ బాడీ, కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రీడిజైన్డ్ సైడ్ ప్యానెల్స్ తో పాటు కొత్త కలర్ ఆప్షన్లతో రానుంది. బడ్జెట్, ప్రీమియం వేరియంట్లుగా అందుబాటులోకి రానుంది.

⦿ సింపుల్ వన్ జెన్ 2  

Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బెంగళూరు స్టార్టప్ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసింది. హై పెర్ఫార్మెన్స్ EVగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. దీని ధర రూ. 1.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 3.7 kWh, 4.5 kWh, 5 kWh, 6.5 kWh బ్యాటరీ ఆప్షన్స్ లో వస్తుంది. ఆయా వేరియంట్ ను బట్టి 190 నుంచి 400 కిలో మీటర్ల వరకు రేంజ్ ను అందిస్తుంది. ఈ స్కూటర్ స్పీడ్ 0-40  వేగాన్ని కేవలం 2.77 సెకెన్లలో అందుకుంటుంది. 7 ఇంచ్ టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, USB చార్జింగ్, క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, లైఫ్‌ టైమ్ వారంటీ లాంటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.

⦿ యమహా ఏరాక్స్ E  

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఏరాక్స్ E. త్వరలో ఈ స్కూటర్ లాంచ్ కాబోతోంది. దీని ధర రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీనిలో డ్యూయల్ డిటాచబుల్ లిథియం ఐయాన్ ప్యాక్స్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ మీద 106 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టెలిమాటిక్స్ కనెక్టివిటీ, స్టార్ట్ ఫీచర్లు ఉంటాయి. స్పోర్టీ ఈవీ సెగ్మెంట్ లో ఈ కొత్త ఆప్షన్ రానుంది. యువతలో యమహా ఏరాక్స్ E మీద ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది.

⦿ హోండా ఆక్టివా 7G

Advertisement

క్లాసిక్ కమ్యూటర్ స్కూటర్ అప్‌ డేటెడ్ వెర్షన్ గా అందుబాటులోకి రాబోతోంది. ఈ ఏడాదిలోనే లాంచ్ కాబోతోంది. దీని ధర రూ. 80 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ 110సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 55 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. LED లైటింగ్, స్మార్ట్ కీ, మెరుగైన ఎర్గనామిక్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఫ్యామిలీ స్కూటర్లలో టాప్ లో ఉంటుంది.

⦿ వెస్పా GTS 310  

వెస్పా నుంచి మరో ప్రీమియం పెట్రోల్ స్కూటర్ ఇది.  స్టైల్ తో పాటు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. దీని ధర రూ. 6.8 లక్షలు ఉంటుంది. 310 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 25 hp పవర్, 28.9 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. లీటర్ కు 73 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. గంటకు 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ABS, ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, CVT ట్రాన్స్‌ మిషన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. లగ్జరీ సెగ్మెంట్‌ లో పాపులర్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా జనవరి 2026 స్కూటర్ మార్కెట్ హీట్ పెంచబోతోంది.

Read Also: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×