E-Paper
Advertisement

Royal Enfield 650cc: పవర్‌ఫుల్ బుల్లెట్ బైక్ రాబోతోంది.. త్వరోలనే రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc లాంచ్.. దీని ధర

Royal Enfield 650cc: పవర్‌ఫుల్ బుల్లెట్ బైక్ రాబోతోంది.. త్వరోలనే రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc లాంచ్.. దీని ధర
Advertisement

Royal Enfield 650cc| రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే అతి పవర్‌ఫుల్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీని పేరు బుల్లెట్ 650. ఇందులో 650cc ఇంజిన్ ఉంటుంది. ఈ మోడల్ పాత బుల్లెట్‌ని ప్రీమియం సెగ్మెంట్‌కి తీసుకొస్తుంది. భారత్‌లో బుల్లెట్ బైక్ ఎప్పుడూ టాప్ సెల్లర్. ప్రపంచంలో కొన్ని దశాబ్దాలుగా ఆన్ డిమాండ్ ఉత్పత్తి అవుతున్న బైక్ కూడా ఇదే. ఇప్పుడు బుల్లెట్‌ని 650cc బైక్ ఫ్యామిలీలో చేరబోతోంది.

ఇంజిన్, పర్ఫామెన్స్ ఎలా ఉంది?

బుల్లెట్ 650ccలో 647.95cc పారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 47 హార్స్ పవర్, 52.3 Nm టార్క్ ఇస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా వస్తుంది. డౌన్ షిఫ్ట్ స్మూత్‌గా ఉంటుంది.

డిజైన్, కలర్స్ ఎలా ఉన్నాయి?

Advertisement

కొత్త ఇంజిన్ వెర్షన్ అయినప్పటికీ కంపెనీ పాత బుల్లెట్ లుక్‌ని పూర్తిగా మార్చలేదు. పెద్ద రౌండ్ ఫ్యూయల్ ట్యాంక్, హ్యాండ్ పిన్ స్ట్రైప్స్, క్రోమ్ మడ్‌గార్డ్స్, పాత పైలట్ ల్యాంప్స్.. అన్నీ క్లాసిక్ స్టైల్ లో ఉన్నాయి. లైటింగ్ LED అయినా పాత డిజైన్‌లాగానే ఉంటుంది. అందుబాటులో ఉన్న కలర్స్ చేస్తే.. క్యానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ. ఇండియాలో కూడా ఇవే కలర్స్ వచ్చే అవకాశం ఉంది.

బ్రేక్స్, సైజ్ ఎలా ఉంది?

ముందు 320mm, వెనుక 300mm డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ముందు టైర్ 100/90, వెనుక టైర్ 140/70 – బుల్లెట్ 350 కంటే వైడ్. బరువు 243 కేజీలు, పొడవు 2.3 మీటర్లకు పైగా. గ్రౌండ్ క్లియరెన్స్ 154mm, సీట్ హైట్ 800mm. ఫ్యూయల్ ట్యాంక్ 14.8 లీటర్లు.

సస్పెన్షన్, వీల్స్ ఎలా ఉన్నాయి?

Advertisement

స్టీల్ ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ ఉంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్ (120mm ట్రావెల్), వెనుక ట్విన్ షాక్స్ (90mm ట్రావెల్). ముందు 19 అంగుళాలు, వెనుక 18 అంగుళాలు వీల్స్.. అన్నీ క్లాసిక్ లుక్ లోనే స్టైలిష్ గా ఉన్నాయి.

Also Read: మారుతి బ్రెజ్జా vs నిస్సాన్ మాగ్నైట్.. కాంపాక్ట్ SUVలో ఏది బెటర్?

ధర ఎంత ఉంటుంది?

బుల్లెట్ 650 ధర సుమారు రూ.3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 650cc ఫ్యామిలీలో క్లాసిక్ 650 ట్విన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని నెలల్లో సేల్స్ ప్రారంభమవుతాయి. క్లాసిక్ బుల్లెట్ లవర్స్‌కి ఎక్కువ పవర్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. రాయల్ ఎన్‌ఫీల్డ్ మళ్లీ బుల్లెట్‌ని ప్రీమియం లెవల్‌కి తీసుకొచ్చింది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×