E-Paper
Advertisement

Car AC Tips: వామ్మో.. ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేయడం ఇంత డేంజరా?

Car AC Tips: వామ్మో.. ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేయడం ఇంత డేంజరా?
Advertisement

Summer Car Cooling Tips: సమ్మర్ లో ఎండలో ఉంచిన కారులోకి వెళ్లగానే, చాలా మంది వెంటనే ఏసీ ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ చేయడం వల్ల కారు క్యాబిన్ త్వరగా చల్లగా అవుతుందని భావిస్తారు. కానీ, అలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఏసీ సిస్టమ్‌పై ఎక్కువ ప్రెజర్ పడుతుందంటున్నారు. అంతేకాదు, కారు త్వరగా కూడా కాదంటున్నారు.

ఎండలో పార్క్ చేసిన కారు త్వరగా కూల్ కావాలంటే?

నిజానికి ఎండలో పార్క్ చేసిన కారులో లోపల వేడి బయట కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు  కారు లోపలి వేడి ఇంచుమించు 50°C వరకు ఉంటుంది. అలాంటి వేడిని ఒక్కసారిగా ఏసీతో తగ్గించడం అంత ఈజీ కాదు. అందుకే, కారులోకి వెళ్లిన వెంటనే ఏసీ ఆన్ చేయకుండా, కారులో ఉన్న వేడి గాలిని బయటకు పంపించాలి. అంటే, కారు డోర్లు లేదంటే, విండోస్ కాసేపు ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల కారు లోపలి వేడిగాలి బయటకు వెళ్తుంది. అంతేకాదు, కారు స్టార్ట్ చేసిన వెంటనే కొన్ని సెకన్ల పాటు  విండోస్ ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం మంచిది. ఈ సమయంలో లోపల ఉన్న వేడిగాలి త్వరగా బయటకు పోతుంది.

Advertisement

ఆ తర్వాత ఏసీ ఆన్ చేస్తే, త్వరగా కారు క్యాబిన్ కూల్ అవుతుంది. లేదంటే, లోపల ఉన్న ఎక్కువ వేడిని తగ్గించడానికి ఏసీ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా ఫ్యూయెల్ ఎక్కువ అయిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..  చాలా మంది కారు స్టార్ట్ చేసి నిలబడి ఉన్న సమయంలో ఏసీ ఆన్ చేసి చల్లబడాలని భావిస్తారు. కానీ, ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, కారు కదులుతున్నప్పుడు AC కంప్రెసర్ మరింత బాగా పని చేస్తుంది.  అంటే, కారు స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ మొదలుపెట్టడం మంచిది.

Read Also:  హైబ్రిడ్ కారు బ్యాటరీ ఫెయిల్ అయితే? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా?

కారు త్వరగా కూల్ కావాలంటే ఎలా?

Advertisement

కారు లోపల త్వరగా కూల్ కావాలంటే.. ముందుగా రీసర్క్యులేషన్ మోడ్ ఉపయోగించాలి. ఇది కారులోని గాలినే కూల్ చేస్తుంది. అంటే బయట నుంచి వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది. కారు త్వరగా చల్లబడుతుంది. అయితే, కొంతసేపటి తర్వాత ఫ్రెష్ ఎయిర్ మోడ్ ని వాడాలి. లోపల ఎయిర్ చాలా లైట్ గా మారుతుంది. ఏసీని ఎప్పుడూ హై టెంపరేచర్‌ లో కాకుండా లో టెంపరేచర్‌ లో పెట్టి ఫ్యాన్ స్పీడ్‌ తో కంట్రోల్ చేయడం ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల ఏసీ పని తీరు మరింత మెరుగు అవుతుంది. ఫ్యూయెల్ కూడా చక్కగా ఆదా అవుతుంది.

Read Also:  సమ్మర్‌ లో కారు ఓవర్‌ హీట్ అవుతోందా? సింఫుల్ గా ఈ టిప్స్ ఫాలోకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×