E-Paper
Advertisement

రూ.74 వేలకే స్టైలిష్ EV స్కూటర్.. అదీ మెటల్ బాడీతో!

రూ.74 వేలకే స్టైలిష్ EV స్కూటర్.. అదీ మెటల్ బాడీతో!
Advertisement

Komaki’s New Electric Scooters: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కోమాకి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. MG Pro V, MG Pro+ పేర్లతో వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ మోడళ్ల ధరలు రూ.73,999, రూ.79,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.

రూ. 80 వేల లోపు మెటల్ బాడీతో..

ముఖ్యంగా రూ.80 వేలలోపే మెటల్ బాడీతో అందుబాటులోకి రావడం ఈ స్కూటర్ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ ధరలో వచ్చే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫైబర్ బాడీతో ఉంటాయి. కానీ, కోమాకి బలమైన మెటల్ బాడీని అందించింది. రోజువారీ వినియోగంలో స్కూటర్ మరింత బలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉండే అవకాశం ఉంటుంది. గుంతల రోడ్ల మీద కూడా ఈ స్కూటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని కంపెనీ వెల్లడించింది.

సింగిల్ ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్

Advertisement

రేంజ్ విషయంలో కూడా ఈ రెండు స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. MG Pro V సింగిల్ ఛార్జ్ తో 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక MG Pro+  150 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రోజూ ఆఫీస్‌ కు వెళ్లేవాళ్లు, సిటీలో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు స్కూటర్లలో కూడా BLDC హబ్ మోటార్ తో పాటు LiFePO4 బ్యాటరీను ఉపయోగించారు. ఈ బ్యాటరీ సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఎక్కువ కాలం పనిచేయడం, భద్రత పరంగా మెరుగ్గా ఉండటం  ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల విషయంలోనూ కొమాకి ఏమాత్రం తగ్గలేదు. మొబైల్ యాప్ కనెక్టివిటీ ద్వారా బ్యాటరీ స్టేటస్, రేంజ్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ లాక్, పార్కింగ్ అసిస్ట్, రిపేర్ మోడ్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. MG Pro+ వేరియంట్‌ లో పెద్ద స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.  సరసమైన ధరలో కూడా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ స్కూటర్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించే ఫీచర్లను తక్కువ ధరలోనే అందించాలన్న లక్ష్యంతో ఈ కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు వివరించింది. రోజువారీ ప్రయాణాలకు బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి కోమాకి MG Pro V, MG Pro+ మోడళ్లు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: గంటలో ఛార్జింగ్.. 187 కి.మీ రేంజ్.. అదిరిపోయే విడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×