E-Paper
Advertisement

హీరో Xpulse 421 స్పై షాట్స్ లీక్.. లుక్ అదిరింది భయ్యా!

హీరో Xpulse 421 స్పై షాట్స్ లీక్.. లుక్ అదిరింది భయ్యా!
Advertisement

హీరో మోటోకార్ప్ నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న Xpulse 421 అడ్వెంచర్ బైక్ త్వరలో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. తాజాగా ఈ బైక్ పర్వత ప్రాంతాల్లో టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. ఈ ఫోటోలను చూస్తే, Xpulse 421 గురించి పలు వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం హీరో Xpulse 200, Xpulse 210 మోడళ్లను అమ్ముతుండగా, ఈ మోడల్ వాటి కంటే పెద్దదిగా, మరింత పవర్ ఫుల్ గా ఈ కొత్త మోడల్ రానుంది.

ఫైనల్ టెస్టింగ్ దశలో హీరో Xpulse 421  

2024లో జరిగిన EICMA మోటార్ షోలో హీరో ఈ బైక్‌కు సంబంధించిన డిజైన్ స్కెచ్‌ ను మాత్రమే చూపించింది. ఆ తర్వాత పెద్దగా సమాచారం రాలేదు. అయితే, ఇప్పుడు బయటపడిన స్పై చిత్రాలు చూస్తే, Xpulse 421 చివరి టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే Xpulse 421 పూర్తిస్థాయి అడ్వెంచర్ టూరర్‌ గా కనిపిస్తోంది. పెద్ద విండ్‌ స్క్రీన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, బలమైన బాడీ ప్యానెల్స్, ఎత్తుగా అమర్చిన ఎగ్జాస్ట్ మరింత అడ్వెంచర్ లుక్‌ను ఇస్తున్నాయి. లాంగ్ జర్నీస్, ఆఫ్ రోడ్ రైడింగ్ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఈ బైక్‌లో కొత్త 400సీసీకి పైబడిన సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను హీరో ఉపయోగించే అవకాశం ఉంది. అధికారిక పవర్ ఫిగర్లు ఇంకా ప్రకటించనప్పటికీ, దాదాపు 40 హెచ్‌పీ పవర్, 40 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరో తయారు చేసిన అతిపెద్ద లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కావడం విశేషం. ఆఫ్ రోడ్ పనితీరును దృష్టిలో ఉంచుకుని కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్‌ ను ఉపయోగించినట్లు కనిపిస్తోంది. ముందు భాగంలో లాంగ్ ట్రావెల్ USD ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ను తీసుకొచ్చారు. గతుకు రోడ్లపై కూడా మంచి రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ లభించే అవకాశం ఉంది.

వీల్స్ విషయంలో కూడా హీరో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో 21 అంగుళాల వీల్ ఉండగా,   వెనుక భాగంలో 17 అంగుళాల వీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సెటప్ వల్ల సీటు ఎత్తు కొంత తగ్గడంతో పాటు రోడ్డుపై స్టెబులిటీ కూడా మెరుగుపడుతుంది. భద్రత పరంగా రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు అందించనున్నారు. డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS లాంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశముంది. ఆఫ్ రోడ్ రైడింగ్‌ కు అనుగుణంగా బలమైన స్వింగ్ ఆర్మ్‌ ను ఉపయోగించారు.

ఫీచర్ల గురించి..

Advertisement

Xpulse 421లో పెద్ద TFT డిస్‌ ప్లే కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా బైక్‌ల కంటే పెద్ద స్క్రీన్ ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త స్విచ్‌గేర్‌ తో పాటు రైడింగ్ మోడ్‌ ల కోసం ప్రత్యేక బటన్ కూడా కనిపించింది. అలాగే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఈ బైక్‌లో ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ బైక్ ను EICMA 2026లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.2.70 లక్షల నుంచి రూ.2.90 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

Read Also: హీరో సూపర్ ప్లాన్.. ఏకంగా 12 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×