E-Paper
Advertisement

Car AC-on Mandatory: ఇకపై ఏసీ ఆన్ చేసి మైలేజ్ టెస్ట్ చేయాల్సిందే.. కేంద్రం కీలక నిర్ణయం!

Car AC-on Mandatory: ఇకపై ఏసీ ఆన్ చేసి మైలేజ్ టెస్ట్ చేయాల్సిందే.. కేంద్రం కీలక నిర్ణయం!
Advertisement

రోడ్డు ప్రమాదాలను తగ్గించే V2V టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏసీ ఆన్ లో ఉంచే మైలేజీ టెస్టులు చేయాలని ఆయా ఆటో మోబైల్ కంపెనీలను ఆదేశించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం కారణంగా కార్ల అసలు మైలేజ్ తెలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కార్లలో ఏసీ ఉన్నప్పటికీ, ఆఫ్ చేసి మైలేజీ టెస్ట్ చేస్తున్నారు. ఇక కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు AC ఆన్‌ చేసి, ఆఫ్ చేసినప్పుడు మైలేజీని ప్రకటించాలి. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు సరైన సమాచారం తెలుస్తుంది.

పాత, కొత్త రూల్స్ మధ్య తేడాలేంటి?

ప్రస్తుతం కార్ల తయారీదారులు ఏసీ ఆఫ్ చేసి మైలేజ్ టెస్ట్ చేసి వివరాలు వెల్లడిస్తున్నారు. కానీ, డ్రైవింగ్‌లో ఏసీ ఆన్ చేసి నడపడం మూలంగా మైలేజీ తగ్గుతుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు, ఆఫ్ చేసినప్పుడు కూడా మైలేజీని టెస్ట్ చేసి రెండు రకాల మైలేజీలను వెల్లడించాయి. ఈ నిర్ణయం కారణంగా కస్టమర్‌లు ఏసీ ఆన్‌లో నడిపినప్పుడు ఎంత ప్యూయెల్ అయిపోతుందనేది కరెక్ట్ గా తెలుస్తుంది. అదే సమయంలో కొనుగోలుదారులకు సరైన మైలేజ్ గురించి తెలియడంతో, సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ARAI ద్వారా మైలేజ్ పరీక్షలు

Advertisement

దేశంలో వాహన ధృవీకరణ, ఇంధన సామర్థ్య ధ్రువీకరణకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. AC ఆన్ చేసిన పరీక్షలను నిర్వహించడం వల్ల ప్రస్తుత క్లెయిమ్‌లతో పోలిస్తే తక్కువ మైలేజ్ ఉంటుందని ఆటో నిపుణులు చెప్తున్నారు. అక్టోబర్ 2026 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఆ తర్వాత రోజు నుంచి వచ్చే అన్ని కొత్త కార్లు ఈ నింబంధన పరిధిలోకి వస్తుంది.

ఏసీకి సంబంధించి కీలక విషయాలు  

నిజానికి కారు పార్క్ చేసిన తర్వాత ఏసీ ఆన్ చేసే ముందు వేడి గాలి బయటకు పోయేలా కొన్ని నిమిషాలు విండోస్ తెరిచి ఉంచడం మంచిది. కారు పార్క్ చేసి ఉన్నప్పుడు ఎక్కువసేపు ఏసీ ఆన్‌లో ఉంచితే బ్యాటరీపై భారం పడి బ్యాటరీ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇంజిన్ ఆఫ్‌ లో ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఏసీ వాడకపోవడం చాలా మంచిది. కారు వేడెక్కుతుంటే, వెంటనే ఏసీ ఆపి, హీటర్ ఆన్ చేయడం లేదంటే ఇంజిన్ ఆపివేయడం మంచిది. ఈ నిర్ణయం కారణంగా ఇంజిన్ సేఫ్ గా ఉంటుంది. తరచుగా ఈ సమస్య సుదూర ప్రయాణాల సమయంలో కొనసాగుతుంది. కాసేపు రోడ్ సైడ్ ఆపి రిలాక్స్ కావడం వల్ల ఇంజిన్ కూల్ అవుతుంది. కారుకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. మొత్తంగా వాహనాలకు సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది.

Advertisement

Read Also:  20 లక్షల కారు.. జస్ట్ 4 లక్షలకే.. ఎక్కడో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×