E-Paper
Advertisement

Solarstic Vehicles: ఇక ఈవీ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హ్యుందాయ్!

Solarstic Vehicles: ఇక ఈవీ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హ్యుందాయ్!
Advertisement

ఈవీ రంగం రోజు రోజుకు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం హ్యుందాయ్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఈవీలను ఛార్జింగ్ చేసి, నడిపిస్తుండగా, ఇకపై ఛార్జింగ్ చేయకుండానే నడిచే టెక్నాలజీని పరిచయం చేసింది. తాజాగా లాస్ వెగాస్ లో జరిగిన CES 2026లో ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. “ఇంజెక్షన్ మోల్డెడ్ వెహికల్ సోలార్ మాడ్యూల్” పేరుతో పరిచయం చేసింది. దీనిని హ్యుందాయ్ గ్రూప్ స్పిన్ ఆఫ్ అయిన సోలాస్టిక్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది వెహికిల్ కదులుతున్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తిని చేసి ఈవీ రేంజ్ ను పెంచుతుంది.

ఇంతకీ ఏంటీ కొత్త టెక్నాలజీ?

హ్యుందాయ్ ఇంజెక్షన్ మోల్డెడ్ వెహికల్ సోలార్ మాడ్యూల్ అనేది కారుకు నేరుగా సోలార్ విద్యుత్ ద్వారా కారు ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్ గ్లాస్ తో రూపొందిస్తుండగా, ఈ టెక్నాలజీలో పాలీమర్ సోలార్ పానెల్స్ ను ఉపయోగించనున్నారు. వాటిని కారు పై కప్పుతో పాటు, హుడ్ లాంటి భాగాలకు సరిగ్గా సెట్ట్ అయ్యేలా ఏర్పాటు చేస్తారు. ఇది సాంప్రదాయ భారీ, ఫ్లాట్ గ్లాస్ సోలార్ ప్యానెల్స్ మాదిరిగా కాకుండా, సోలార్స్టిక్ తేలికైన పాలిమర్ ను ఉపయోగిస్తుంది. ఇది సోలార్ ప్యానెల్స్ ను కారు బాడీకి అనుగుణంగా మౌల్డ్ చేస్తుంది.  ప్యానెల్స్ కారు బయటి స్కిన్ లా తయారు చేస్తారు. స్టైలింగ్, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. ఇవి కారు రన్నింగ్ సమయంలోనే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇది 500 వాట్ల వరకు పవర్ ను అందిస్తుంది. లాంగ్ టూర్ లో బ్యాటరీ 30 శాతం వరకు రీఛార్జ్ చేస్తుంది. హ్యుందాయ్ IONIQ 5 లాంటి కార్లలో ఈ ప్యానెల్స్ సుమారు 80 కిమీ అదనపు రోజువారీ రేంజ్ ను అందిస్తాయి. CES 2026లో  ఈ సాంకేతికతకు మంచి ప్రశంసలు లభించాయి. అంతేకాదు,  అడ్వాన్స్‌డ్ వెహికల్ టెక్నాలజీ, మొబిలిటీ కేటగిరీలో  CES 2026 ఇన్నోవేషన్ అవార్డును దక్కించుకుంది.

2027లో అందుబాటులోకి కొత్త టెక్నాలజీ

Advertisement

ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. రాబోయే సంవత్సరాల్లో సోలార్ తో కూడిన వెహికల్స్ విడుదల చేయాలని భావిస్తున్నాయి. సోలార్‌స్టిక్ ఇప్పటికే హ్యుందాయ్, కియాకు సంబంధించి పెద్ద మొత్తంలో కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తుఓంది. 2027 వరకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం BMW, హోండా, నిస్సాన్ లాంటి ఇతర దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీలతో చర్చలు జరుపుగతోంది. ఈ ఏడాది చివరి నుంచే ఈ టెక్నాలజీని పరిచయం చేయాలని భావిస్తున్నది.

ఈవీ రంగంలో సరికొత్త ముందడుగు

ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఈవీ ఛార్జింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా తక్కు దూరం ప్రయాణాలకు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కారులో బాడీలో భాగంగా ఉండటం వల్ల డిజైన్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు. లుక్ మారదు. అదే సమయంలో ఈ సోలార్ ప్యానెల్స్ గ్లాస్ ప్యానెల్స్ కంటే చాలా తక్కువ ధరను కలిగి ఉండనున్నాయి. వీటిని కారుకు యాడ్ చేయడం వల్ల ధర కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వీటి వలన రన్నింగ్ కాస్ట్ భారీగా తగ్గనుంది. మొత్తంగా ఈ టెక్నాలజీ ఈవీ రంగంలో ఓ కీలక ముందడుగు కాబోతోంది.

Advertisement

Read Also: ఇక నో రోడ్ యాక్సిడెంట్స్ .. కార్లు మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×