E-Paper
Advertisement

Honda EV: హోండా షాకింగ్ డెసిషన్, ఆ రెండు కీలక మోడల్స్ కు బ్రేక్!

Honda EV: హోండా షాకింగ్ డెసిషన్, ఆ రెండు కీలక మోడల్స్ కు బ్రేక్!
Advertisement

Honda Dropped the 0 Series SUV And Sedan:  ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం శరవేగంగా మారుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల  విషయంలో కంపెనీలు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి.  అందులో భాగంగానే జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల అభివృద్ధిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

హోండా 0 Series SUV, సెడాన్ కు బ్రేక్   

హోండా అభివృద్ధి చేస్తున్న 0 Series SUV, సెడాన్ ప్రాజెక్టులను అధికారికంగా క్యాన్సిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రెండు మోడళ్లను మొదట ఉత్తర అమెరికా మార్కెట్ కోసం తయారు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో హోండా విడుదల చేయబోయే 0 సిరీస్  ఎలక్ట్రిక్ లైనప్‌ లో ఈ మోడల్స్ అత్యంత కీలకమైనవిగా ప్రకటించింది. తొలుత కంపెనీ 2030 నాటికి మొత్తం ఏడు  0 సిరీస్  ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో EV రంగంలో రాణించడం అంత ఈజీ కాదని హోండా అంచనా వేసింది. ముఖ్యంగా అమెరికాలో ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పులు EV తయారీదారులపై ప్రభావం చూపుతున్నాయనే నిర్ణయానికి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే ప్రోత్సాహకాలు తగ్గడం, కొన్ని కొత్త టారిఫ్ విధానాలు అమల్లోకి రావడం లాంటి అంశాలను బేస్ చేసుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా నిర్ణయంతో భారీగా నష్టం

Advertisement

తాజాగా హోండా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  సుమారు 340 బిలియన్ నుంచి 570 బిలియన్ యెన్‌ల వరకు కంపెనీకి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం దాదాపు 2.5 ట్రిలియన్ యెన్‌ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక చైనా మార్కెట్‌ లో పెరుగుతున్న పోటీ కూడా హోండా నిర్ణయంపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. అక్కడ కొత్త EV బ్రాండ్లు సాఫ్ట్‌ వేర్ ఆధారిత వాహనాలు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ టెక్నాలజీ లతో మార్కెట్‌ ను ఆకర్షిస్తున్నాయి. వాటితో పోటీ పడటం అంత ఈజీ కాదని హోండా కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: మారుతి To టాటా.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ పెట్రోల్ కార్లు ఇవే!

ఇండియా ప్రణాళికలు యధాతథం!

Advertisement

ఇక భారత్ లో హోండా EV ప్రణాళికలు యధావిథిగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. రాజస్థాన్‌ లోని తపుకర ప్లాంట్‌ లో హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV తయారీని 2027 నాటికి ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో  భారత్‌ ను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని హోండా భావిస్తోంది.

Read Also:  టాటా పంచ్ ఈవీని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×