E-Paper
Advertisement

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!
Advertisement

Honda ADV160 E85 Scooter: హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్ కోసం కొత్త అడ్వెంచర్ స్టైల్ మ్యాక్సీ స్కూటర్ ADV160ను పరిచయం చేసింది. E85 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన భారత తొలి స్కూటర్ ఇదేనని కంపెనీ తెలిపింది. E85 అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. భవిష్యత్‌ లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా హోండా ఈ మోడల్‌ ను తీసుకొచ్చింది.

ADV160 స్కూటర్ గురించి..

ADV160ను హోండా తన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్  లిస్టులో చేర్చింది. ఈ స్కూటర్‌ ను భారత్‌ లోనే తయారు చేయనుండగా, దేశీయ మార్కెట్‌తో  పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. రెడ్‌ వింగ్, బిగ్‌ వింగ్ డీలర్‌ షిప్స్ ద్వారా ఈ మోడల్‌ ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఇంజిన్ గురించి..    

Advertisement

ఈ స్కూటర్‌ లో 157సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 16.3 bhp పవర్, 14.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ పెట్రోల్‌తో పాటు E85 ఇంధనాన్ని ఉపయోగించేలా ఇంజిన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో భవిష్యత్‌లో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి ఈ స్కూటర్ సిద్ధంగా ఉంటుంది.

డిజైన్ గురించి..

ADV160కు హోండా అంతర్జాతీయంగా విక్రయించే X-ADV మోడల్ నుంచి స్ఫూర్తి పొందింది. ముందుభాగంలో ట్విన్ LED హెడ్‌ ల్యాంప్స్, ఎత్తుగా ఉండే అడ్జస్టబుల్ విండ్‌ స్క్రీన్, మస్కులర్ బాడీ, అడ్వెంచర్ స్టైల్ టైర్లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ స్కూటర్‌ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగర ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్‌ లకు అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా కూడా ADV160 ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఫుల్ కలర్ TFT డిస్‌ ప్లే ఉంటుంది. హోండా రోడ్‌ సింక్ యాప్ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ ను కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్స్ లాంటి సమాచారం డిస్‌ ప్లే పైనే చూసే అవకాశం ఉంటుంది. భద్రత కోసం హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, సింగిల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. అడిషనల్ గా USB ఛార్జింగ్ పోర్ట్, ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకునేలా 27 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంది. దీంతో రోజువారీ వినియోగంతో పాటు టూరింగ్‌ కు కూడా ఈ స్కూటర్ ఉపయోగపడుతుంది.

ధర, లాంచ్ గురించి..

ADV160 ధర, భారత మార్కెట్లో ఎప్పుడు అమ్మకానికి అందుబాటులోకి వస్తుందనే విషయాలను హోండా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×