E-Paper
Advertisement

ఈవీలకు నో రోడ్ ట్యాక్స్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

ఈవీలకు నో రోడ్ ట్యాక్స్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
Advertisement

Big Boost for EV Buyers in Delhi: ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఈవీ పాలసీ 2026–2030 దేశ రాజధానిలో రవాణా రంగంలో పెద్ద మార్పులకు దారి తీసేలా కనిపిస్తోంది. ఈ పాలసీ ప్రకారం, రూ. 30 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్లకు పూర్తి పన్ను రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మాఫీ అవుతాయి. ఈ బెనిఫిట్స్  2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులకు ఎలక్ట్రిక్ కార్లు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

2020లో ఈవీ పాలసీకి కొనసాగింపుగా..

ఈ కొత్త ఈవీ పాలసీ ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఇప్పటికే 2020లో తీసుకువచ్చిన ఈవీ పాలసీకి కొనసాగింపుగా ఈ కొత్త ముసాయిదా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలను తీసుకుంటుంది. త్వరలో తుది రూపం దాల్చనుంది.  రూ. 30 లక్షల లోపు ఉన్న ఎలక్ట్రిక్ కార్లకే పూర్తి ప్రయోజనాలు వర్తిస్తాయి. అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు ఈ మినహాయింపులు ఉండవు. మాస్ మార్కెట్ కార్లకు ఎక్కువగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ లాంటి కంపెనీలు ఈ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ కంపెనీల కార్లు ఇప్పటికే ఈ ధర పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ వంటి మోడళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మహీంద్రా, ఎంజీ కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారవచ్చు. ఈ రాయితీల వల్ల కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్ కార్లతో సమానంగా, తక్కువగా మారే అవకాశం ఉంటుంది.

హైబ్రిడ్ వాహనాలకు 50 శాతం రోడ్ ట్యాక్స్ మినహాయింపు

ఇక హైబ్రిడ్ వాహనాలకు కూడా కొంత ఊరట కల్పించారు. రూ. 30 లక్షల లోపు ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు 50% వరకు పన్ను తగ్గింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనివల్ల మారుతి సుజుకి, టయోటా వంటి కంపెనీలకు లాభం చేకూరుతుంది. గ్రాండ్ విటారా, హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్లు ఈ పరిధిలోకి వస్తాయి. అయితే, హైబ్రిడ్‌ వాహనాలకు ఈ సబ్సిడీలు ఇవ్వడంపై  విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పును కొంత నెమ్మదింపజేయవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా రవాణా విషయంలోనూ కీలక నిర్ణయాలు

Advertisement

ఇక ప్రజా రవాణా విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా రిజిస్టర్ అయ్యే త్రీ వీలర్లు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని నిర్ణయించింది. దీని వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ విధానం పూర్తిగా అమలులోకి వస్తే, ఢిల్లీలో వాహన కొనుగోలు విధానంలో పెద్ద మార్పు కనిపించే అవకాశం ఉంది.

Read Also: ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×