E-Paper
Advertisement

Summer Bike Helmet Tips: బైక్ రైడర్లకు సమ్మర్ టిప్స్… హెల్మెట్‌ ఇలా పెట్టుకుని వెళ్తే కూల్‌ గా ఉంటారు!

Summer Bike Helmet Tips: బైక్ రైడర్లకు సమ్మర్ టిప్స్… హెల్మెట్‌  ఇలా పెట్టుకుని వెళ్తే కూల్‌ గా ఉంటారు!
Advertisement

Summer Motorcycle Helmet Tips: ఎండా కాలంలో బైక్ ప్రయాణం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తే ఇంకా నరకంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు తల అంతా చెమటపడ్డి వేడి ఎక్కువగా అనిపిస్తుంది. అయితే, సరైన హెల్మెట్‌ ను ఎంచుకోవడం, కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల సమ్మర్ లో కూడా ఎలా ఇబ్బంది లేకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ సమ్మర్ లో ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సమ్మర్ లో హెల్మెట్ పెట్టుకుని కూల్ గా ఎలా వెళ్లాలంటే?

⦿ సమ్మర్ లో సాధారణంగా వెంటిలేషన్ బాగా ఉన్న హెల్మెట్‌ ను  ఉపయోగించాలి. గాలి ప్రవాహం సరిగ్గా జరిగాలి. ఎగ్జాస్ట్ వెంట్లు ఉన్న ఫుల్ ఫేస్, మాడ్యులర్ హెల్మెట్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

⦿ సమ్మర్ లో లైట్ కలర్స్ లో ఉన్న హెల్మెట్లు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. కాఈ,  నలుపు రంగు హెల్మెట్ల ఎండను గ్రహిస్తాయి. అందుకే, వేసవిలో నల్లరంగు హెల్మెట్ల కంటే, లైట్ కలర్ హెల్మెట్లను ఉపయోగించడం ఉత్తమం.

⦿ ఎండాకాలం చెమట సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే, హెల్మెట్ లోపల తేమను పీల్చుకునే  హెల్మెట్ లైనర్ ధరించడం మంచిది. ఇది చెమటను పీల్చుకుని తలను చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. అలాగే, హెల్మెట్ ప్యాడింగ్ చెమటతో తడవకుండా ఉండటంతో పాటు పరిశుభ్రంగా ఉంటుంది.

Advertisement

⦿ రైడింగ్ సమయంలో హెల్మెట్‌ లోని అన్ని వెంట్లు ఓపెన్ చేసి ఉంచాలి. అలా చేయడం వల్ల గాలి సులభంగా లోపలికి వచ్చి వేడిని తగ్గిస్తుంది. ట్రాఫిక్‌ లో నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కొద్దిగా గాలి వచ్చేలా వైజర్‌ ను ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు.

⦿ అన్నింటి కంటే ముఖ్యమైన అంశం ఎండ వేడి నుంచి రక్షణ. తీవ్రమైన UV కిరణాలు కళ్లకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే లేతరంగు, ఇరిడియం విజర్ ఉన్న హెల్మెట్ ఉపయోగిస్తే.. కళ్లకు, ముఖానికి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది.

⦿ ఇక సమ్మర్ లో హెల్మెట్‌ ను రెగ్యులర్ గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ప్రతి రైడ్ తర్వాత హెల్మెట్‌ ను వైజర్ ఓపెన్ చేసి, తలకిందులుగా ఉంచి ఆరబెట్టాలి. లైనర్ తొలగించగలిగితే అప్పుడప్పుడు వాష్ చేయడం మంచిది.

మరీ ఎక్కువ వేడి ఉన్న రోజుల్లో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు కొంతమంది మాడ్యులర్, ఓపెన్ ఫేస్ హెల్మెట్ ఉపయోగించవచ్చు. అయితే, ఇవి ఫుల్ ఫేస్ హెల్మెట్‌ తో పోలిస్తే తక్కువ రక్షణను అందిస్తాయి. సరైన హెల్మెట్ ను సెలెక్ట్ చేసుకుంటే, సమ్మర్ లో కూడా సురక్షితంగా, సౌకర్య వంతమైన బైక్ రైడ్‌ ను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

Read Also: వేసవిలో CNG కార్లు వాడుతున్నారా? సేఫ్టీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×