E-Paper
Advertisement

Battery Cycles: ఈ బ్యాటరీ సైకిళ్లు ఉంటే.. పెట్రోల్ చింతే ఉండదు, వీటి ధర ఫీచర్స్ తెలిస్తే ఆశ్యరపోతారు!

Battery Cycles: ఈ బ్యాటరీ సైకిళ్లు ఉంటే.. పెట్రోల్ చింతే ఉండదు, వీటి ధర ఫీచర్స్ తెలిస్తే ఆశ్యరపోతారు!
Advertisement

Best Electric Cycles in India 2026: ఇటీవల మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా వాహనదారులు ఫ్యూయెల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశంలో చాలా మంది చౌకైన, రవాణా సౌకర్యాల మీద ఫోకస్ పెడుతున్నారు. అలాంటి వారికి బ్యాటరీ సైకిళ్లు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. ఇవి పెట్రోల్ అవసరం లేకుండా బ్యాటరీతో నడుస్తాయి. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి.

ఇంతకీ ఏంటీ బ్యాటరీ సైకిళ్ల ప్రత్యేకత?

బ్యాటరీ సైకిల్ అనేది సాధారణ సైకిల్‌ లానే ఉంటుంది. కానీ, దీనిలో చిన్న ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఉంటుంది. మీరు పెడల్ తొక్కడం ద్వారా లేదంటే మోటార్ సాయంతో నడిపే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇవి గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆఫీస్‌కు వెళ్లడం, మార్కెట్‌ కు వెళ్లడం, రోజువారీ పనులకు ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా మోడళ్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

బ్యాటరీ పనితీరు ఎలా ఉంటుంది?

Advertisement

ఈ సైకిళ్లలో ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీతో వస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మంచి బ్యాటరీలుసాధారణంగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు పని చేస్తాయి. ఇంట్లోనే 3 నుంచి 5 గంటల్లో పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ రీప్లేస్‌ మెంట్ ఖర్చు రూ. 9,000 నుంచి రూ. 15,000 మధ్య ఉంటుంది.

ఎందుకు ఇప్పుడు బ్యాటరీ సైకిళ్లు బెస్ట్?

ప్రస్తుతం పెట్రోల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాటరీ సైకిల్ చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని అందిస్తుంది. ఒక పెట్రోల్ బైక్‌కు కిలోమీటరుకు రూ. 2 నుంచి 3 ఖర్చు అయితే, ఈ బ్యాటరీ సైకిల్‌ కు కేవలం 10-20 పైసలే ఖర్చవుతుంది. దీని వల్ల నెలకు పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇవి ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకుండా పని చేస్తాయి.

బ్యాటరీ సైకిళ్లు ధర ఎంత ఉంటుంది?  

Advertisement

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బ్యాటరీ సైకిళ్ల ధరలు రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు ఉన్నాయి. చాలా బ్రాండ్లు 20 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. ఆఫ్‌ లైన్ స్టోర్లలో కూడా ఇదే ధరల్లో లభిస్తాయి. అయితే, ఇక్కడ టెస్ట్ రైడ్ చేసే అవకాశం ఉంటుంది.

Read Also:పెట్రోల్ దొరకలేదా? వెంటనే ఈ EV బైకులు కొనేసుకోండి.. చీప్ అండ్ బెస్ట్ ఇవే!

కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

బ్యాటరీ సైకిళ్లు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ అవసరానికి సరిపోయే రేంజ్ ఉన్న మోడల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కనీసం 1-2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉండాలి. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉండే బ్రాండ్‌ ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. రిమూవబుల్ బ్యాటరీ ఉంటే ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also:  కమర్షియల్ యూజ్ కు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర కూడా తక్కువే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×