E-Paper
Advertisement

ఎండలో కూడా హ్యాపీగా వెళ్లొచ్చు, క్రేజీ రెవో వైజర్‌ పరిచయం చేసిన యాక్సోర్!

ఎండలో కూడా హ్యాపీగా వెళ్లొచ్చు, క్రేజీ రెవో వైజర్‌ పరిచయం చేసిన యాక్సోర్!
Advertisement

Made in India Revo Visor: ప్రముఖ హెల్మెట్ తయారీ బ్రాండ్ యాక్సోర్.. మేడ్ ఇన్ ఇండియా రెవో ఆప్టికల్ కోటెడ్ వైజర్ ను పరిచయం చేసింది. ఈ ప్రత్యేక వైజర్‌ ను యాక్సోర్ మాతృ సంస్థ అయిన వేగా ఆటో డెవలప్ చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజీ విదేశాలకే పరిమితమై ఉండగా, ఇప్పుడు దేశీయంగా తయారు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఏంటీ.. ఈ కొత్త రెవో వైజర్‌ ప్రత్యేకత?

ఈ రెవో వైజర్‌ లో సాధారణ రంగు పూత మాత్రమే ఉండదు. ఇందులో ప్రత్యేకమైన మల్టీ లేయర్ ఆప్టికల్ కోటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో,  లైటింగ్ ఎక్కువగా టైమ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. రైడర్‌ కు రోడ్డు స్పష్టంగా కనిపించడంతో పాటు, కళ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. నిజానికి ఈ వైజర్‌కు బయట నుంచి చూసినప్పుడు ఆకట్టుకునేలా మిర్రర్ ఫినిష్ కనిపిస్తుంది. అయితే, అది కేవలం అందం కోసమే కాదు. ఆప్టికల్ కోటింగ్ వల్ల ప్రయాణ సమయంలో మంచి విజుబులిటీ అందిస్తుంది.

కొత్త టెక్నాలజీ కోసం పెట్టుబడి!

Advertisement

ఈ టెక్నాలజీని భారత్ లో తయారు చేయడానికి అవసరమైన మిషనరీ, కోటింగ్ వ్యవస్థ కోసం యాక్సోర్ రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. దీంతో దేశీయంగానే రెవో వైజర్‌ ఉత్పత్తి చేయడంతో పాటు నాణ్యత, తయారీ ప్రక్రియ, భవిష్యత్‌లో కొత్త మార్పులు తీసుకురావడంపై కంపెనీకి పూర్తి కంట్రోల్ ఉండనుంది.

ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెంపు

అటు యాక్సోర్ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచుతోంది. ఏడాదికి 24 లక్షల రెవో ఆప్టికల్ కోటెడ్ వైజర్లు తయారు చేయాలని వేగా ఆటో లక్ష్యంగా పెట్టుకుంది.  వీటిని దేశీయ మార్కెట్‌ తో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

త్వరలో పూర్తి వివరాలు వెల్లడి!

Advertisement

అయితే ఈ కొత్త వైజర్‌కు సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా దీని ధర ఎంత ఉంటుంది? గీతలు పడకుండా ఎంత వరకు రక్షణ ఉంటుంది? UV కిరణాల నుంచి ఎంత రక్షణ లభిస్తుంది?  కోటింగ్ ఎంతకాలం ఉంటుంది? లాంటి అంశాలపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి, భారత్ లో తయారైన ఈ రెవో ఆప్టికల్ కోటెడ్ వైజర్ రైడర్లకు మెరుగైన విజుబులిటీ, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో రూపొందించబడింది. పూర్తిస్థాయి వివరాలు, ధర ప్రకటించిన తర్వాత మార్కెట్లో దీనికి ఎలాంటి స్పందన వస్తుందో తెలియనుంది.

Read Also: తక్కువ ధరలో క్రేజీ ఏథర్ స్కూటర్.. లాంచ్ కు ముందే లుక్ రివీల్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×