// // Yearly Horoscope: - 2026 వృషభరాశి ఫలితాలు -->
E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 వృషభరాశి ఫలితాలు

Yearly Horoscope: 2026  వృషభరాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 వృషభరాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగాల్లో స్థిరత్వం పెరిగి కొత్త అవకాశాలు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి పోటీ ఉన్నప్పటికీ లాభం పెరిగే సూచనలు ఉన్నాయి.  ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. భూమి, ఇల్లు, వాహనం వంటి స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయం ద్వారా ఒక కీలక పని పూర్తి అవుతుంది. విద్యార్థులకు శ్రమతో ఉన్నత ఫలితాలు దక్కుతాయి. ఈ సంవత్సరం  ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4.

జనవరి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారు ఎక్కువగా అనవసర  ఖర్చులు చేయాల్సి వస్తుంది. రుణ బాధలు,, అనారోగ్య బాధలు ఉంటాయి. భూ భవనాల వల్ల లాభం ఉంటుంది. దీర్ఘ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. పితృదేవతల అనుగ్రహం బాగా కలిసి వస్తుంది. 

ఫిబ్రవరి :

ఈ నెలలో ఈ రాశి వారు ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది.  ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసివస్తుంది. అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.

మార్చి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి  ప్రయత్నలోపం లేకున్న ఫలితాలు బాగుంటాయి. దొంగతనం జరగవచ్చు. దూరప్రయాణం ఉంటుంది. ఖరీదైన వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం వస్తుంది.  సంఘంలో హోదా పెరుగుతుంది.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారికి సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం ప్రయత్నం లోపం లేకున్న ఫలితం మంచిగా ఉంటుంది. దొంగతనాలు జరుగవచ్చు.  భార్య మూలకంగా సహాయ సహకారాలు లభిస్తాయి.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి. పదోన్నతి లభిస్తుంది. ఊహించని రీతిన నష్టాలు జరుగుతాయి. దూర సంచారం అధిక ఖర్చులు ఉంటాయి. శారీరిక సౌఖ్యం, మనశ్శాంతి ఉంటుంది.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి  ఉద్యోగంలో శ్రమ అధికం అవుతుంది. విద్యారంగంలో విద్యార్థులు రాణిస్తారు. కార్మికులకు మంచి లాభాలు ఉంటాయి.పోటీలలో వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు.

జూలై:

ఈ నెలలో ఈ రాశి ఉద్యోగులకు  పదోన్నతి లభిస్తుంది. ధీరవ్యాధులు తగ్గుముఖం పడుతాయి. పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషను సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. సంఘంలో హోదా పెరుగుతుంది.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి ఖర్చూ ఎక్కువగా ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘ వ్యాధులు ఏమి చేయవు. దేశ సంచారం, శారీరక, మానసిక నలత ఏర్పడుతుంది.చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. సంఘంలో హోదా పెరుగుతుంది.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ధన దాన్య వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. స్థిర చిత్తం ఉండదు. సంతానానికి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. బందు వివాదాలు కలుగుతాయి.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. బాధలన్ని తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది.  తెలివి బాగా పని చేస్తుంది. సంఘంలో హోదా పెరుగుతుంది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలం లభిస్తుంది. ఉద్యోగాలలో మార్పులు.  వివాదాలు ఎక్కువ అవుతాయి అనారోగ్య బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పెట్టుబడుల వలన నష్టం తప్పదు.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి స్త్రీల మూలకంగా గొడవలు ఉంటాయి. ఆలోచన జ్ఞానం నశిస్తుంది.  అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. సంఘంలో కొన్ని ఇబ్బందుల తలెత్తుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×