// // Ugadi panchangam 2026: - ధనస్సు రాశికి కలలు నెరవేరే టైం వచ్చింది. -->
E-Paper
Advertisement

Ugadi panchangam 2026: ధనస్సు రాశికి కలలు నెరవేరే టైం వచ్చింది.

Ugadi panchangam 2026: ధనస్సు రాశికి కలలు నెరవేరే టైం వచ్చింది.
Advertisement

Ugadi panchangam 2026: ధనస్సు రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో  మిశ్రమ ఫలితాలు ఉంటాయట. ఈ సంవత్సరంలో వీరికి కెరీర్‌లో స్థిరత్వం ఏర్పడుతుందట. ఆర్థికపరమైన పురోగతి సాధిస్తారట. కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయట. అయితే ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరం ఈ రాశి వారు  స్థిరాస్తి కొనుగోళ్లు చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.. ఒక స్థిరమైన ప్రణాళికతో పనులు చేసుకోవడం వల్ల అవి సకాలంలో పూర్తవుతాయట. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత మానసిక ఒత్తిడి కానీ ద్వితీయార్థంలో అంటే జులై తర్వాత గురుబలంతో అద్బుతమైన అదృష్టం కలుగుతుందని సూచిస్తున్నారు పండితులు.

ఇక ఈ రాశిలోకి మూలా నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, పూర్వాషాడ నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్షత్రం ఒకటవ పాదం వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గానూ ఉంటుంది.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు తక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం రెండో భాగంలో ఉద్యోగులకు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్లు వస్తాయి. అలాగే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. కోరుకున్న ట్రాన్స్‌ఫర్లు కూడా లభిస్తాయి. అయితే ఈ రాశి వారు చేసే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి:

ధనస్సు రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ధనస్సు రాశి వారు కొత్తగా అప్పులు చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఇక ద్వితీయార్థంలో వీరికి ఆర్థికపరమైన విషయాల్లో అద్బుతంగా ఉంటుందట.

ఆరోగ్యం:

Advertisement

ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఉంటుందని అలాగే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందటని హెచ్చరిస్తున్నారు. చాతీ, లేదా పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అలాగే తల్లి ఆరోగ్య కూడా క్షీణించే అవకాశం ఉందట. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిపస్తున్నారు. వీళ్లు యోగా, ధ్యానం లాంటివి చేయడం అవసరమని తెలియజేస్తున్నారు.

కుటుంబం అండ్‌ రిలేషన్స్‌:

ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. ప్రథమార్థంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం చివరలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.

పరిహారాలు:

ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతి నిత్యం హనుమాన్‌ చాలీసా పారాయణ చేయాలి. గురువారం దక్షిణమూర్తి దర్శనం చేసుకోవాలి. శనగల దానం చేయాలి. సోమవారం శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వృశ్చిక రాశికి ఈ సంవత్సరం దశ తిరగబోతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×