// // Today Horoscope in Telugu: - నేటి రాశిఫలాలు (02/10/2025) ఆ రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు - వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి                  -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/10/2025) ఆ రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు – వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి                 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/10/2025) ఆ రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు – వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి                 
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 2వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన  ప్రయత్నాలు  ఫలిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తి చేస్తారు. ముఖ్యమైన  వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి:

Advertisement

వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.

మిథున రాశి:  

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయటా నూతన  సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు  మందకొడిగా సాగుతాయి.  కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరిగి వలన మానసికంగా స్థిమితం ఉండదు. వ్యాపారాలు నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటక రాశి:

Advertisement

దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు  కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి.

సింహరాశి:

సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంట  బయట   గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు  సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు  అందుతాయి.  వృత్తి  ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

కన్యారాశి :

నూతన  గృహ వాహన  కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి  లాభాలు పొందుతారు. సంఘంలో  ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.  ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

కుటుంబ సభ్యుల ప్రవర్తన  కొంత ఆందోళన కలిగిస్తుంది.  వృత్తి వ్యాపారాలు  నిదానంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం  తప్పదు.  ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

వృశ్చికరాశి:

ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కీలక  వ్యవహారాలలో  తొందరపాటు వలన  గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రుల నుండి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు రాశి:

వ్యాపారమున సమస్యలను పరిష్కారమౌతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర  ప్రయాణాలలో నూతన  పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక  సమాచారం అందుతుంది.  ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకరరాశి:

ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి  ఉద్యోగమున  స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో  చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.  వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం తో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.  దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభరాశి:

నూతన  వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి  కలుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయుల తో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనరాశి:

వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ  పూర్తికావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంట బయట చికాకులు పెరుగుగుతాయి.  సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×