// // Today Horoscope in Telugu: - నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు - వారి మాటకు విలువ పెరుగుతుంది  -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/10/2025) ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు – వారి మాటకు విలువ పెరుగుతుంది 
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 26వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన  పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభ రాశి:

Advertisement

కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మిథున రాశి:  

వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

సింహరాశి:

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

కన్యారాశి :

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ముఖ్యమైన పనులలో  విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

వృశ్చికరాశి:

ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

ధనస్సు రాశి:

వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

మకరరాశి:

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.

కుంభరాశి:

దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి.

మీనరాశి:

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×