// // Today Horoscope in Telugu: - ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు - వారికి నూతన వాహన యోగం -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి నూతన వాహన యోగం

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి నూతన వాహన యోగం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 26వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. 

వృషభం

Advertisement

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. 

కర్కాటకం

Advertisement

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.

సింహం

వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

కన్య

నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది.

వృశ్చికం

శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. 

ధనుస్సు

బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.  

మకరం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. దైవ సేవాకార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. 

కుంభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

మీనం

 చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×