// // Today Horoscope in Telugu: - ఆ రాశి వారికి బంధువులతో గొడవలు - వారికి అనారోగ్య సూచనలు -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి బంధువులతో గొడవలు – వారికి అనారోగ్య సూచనలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి బంధువులతో గొడవలు – వారికి అనారోగ్య సూచనలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.  ఉద్యోగస్థులకు  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం

Advertisement

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. 

మిథునం

వృత్తి , వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన  రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం

Advertisement

నూతన రుణ యత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట మానసిక ఒత్తిడులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.  వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం

మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న  విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. 

కన్య

ఆర్థిక వ్యవహారాలు కొంత  నిరాశ పరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.  వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చిన్ననాటి మిత్రుల  కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.  ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

వృశ్చికం

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి  ఒత్తిడులు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ  తప్ప  ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.  బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. 

ధనుస్సు

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి  శుభకార్య  ఆహ్వానాలు అందుకుంటారు.  చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.  

మకరం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.  సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  

కుంభం

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

మీనం

బంధువులతో ఊహించని  వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×