// // Today Horoscope in Telugu: - ఆ రాశి వారు శుభవార్తలు వింటారు - వారికి అనారోగ్య సూచనలు -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు – వారికి అనారోగ్య సూచనలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు – వారికి అనారోగ్య సూచనలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.  వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి.

వృషభం

Advertisement

దైవ దర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

మిథునం

కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.  మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

Advertisement

పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.

సింహం

ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి. 

కన్య

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.  స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన  యోగం ఉన్నది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. 

ధనుస్సు

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.  

మకరం

సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది.  

కుంభం

పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మీనం

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×