// // Today Horoscope in Telugu: - ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం - వారు చేపట్టిన పనుల్లో విజయం -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 17వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. 

మిథునం

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.

సింహం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. 

కన్య

ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. 

ధనుస్సు

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.  

మకరం

ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. 

కుంభం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మీనం

స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×