// // Today Horoscope in Telugu: - ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు - వారికి ఆదాయం పెరుగుతుంది -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు – వారికి ఆదాయం పెరుగుతుంది

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు – వారికి ఆదాయం పెరుగుతుంది
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 26వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  స్ధిరాస్తి   ఒప్పందాలలో  పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి. 

వృషభం

Advertisement

 ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా  వ్యవహరించాలి. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత  పెరుగుతుంది.  నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కర్కాటకం

Advertisement

వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.  చేపట్టిన పనులలో  నూతన ప్రణాళికలు అమలుపరచి  సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.

సింహం

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి.  భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున  కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు. 

కన్య

వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం  ప్రశాంతంగా ఉంటుంది.  నూతన వ్యాపారాలు  ప్రారంభించిన  ఆశించిన లాభాలు అందుకుంటారు.  అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి.  వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. నూతన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు.  మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.

వృశ్చికం

బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. శత్రు సమస్యలు తొలగుతాయి.ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.   కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. 

ధనుస్సు

 బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున కొన్ని సంఘటనలు  ఆశ్చర్యం కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి.

మకరం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి.  పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

కుంభం

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త  ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టే పనులను  ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.

మీనం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. కుటుంబ వ్యవహారాలలో  కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులలో  శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై  అధికారులతో చర్చలు ఫలించవు. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×