// // Today Horoscope in Telugu: - నేటి రాశిఫలాలు (1/12/2025) ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకోని లాభాలు - వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (1/12/2025) ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకోని లాభాలు – వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (1/12/2025) ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకోని లాభాలు – వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 1వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 కుటుంబ విషయాలలో   సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల  నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి  కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు.

వృషభం

Advertisement

ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో  కొంత శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక  నిరాశ కలిగిస్తాయి. 

మిథునం

 వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  చిన్ననాటి  మిత్రులతో  గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక  విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం

Advertisement

ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు.

సింహం

వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  ఇతరులకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది  ఇంటా బయట  బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.  ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

పాత రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రాంత  బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.

వృశ్చికం

 ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద  సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఇంట్లో సన్నిహితులతో  ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. 

ధనుస్సు

 చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.  వ్యాపారాలలో మిశ్రమ  ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ  అవసరాలకు ధనం అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం  మంచిది కాదు.

మకరం

ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేపట్టిన  వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం  పొందుతారు.

కుంభం

 సంతాన  విద్యా విషయాలపై  దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు  చురుకుగా పాల్గొంటారు.

మీనం

ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఇతరుల నుండి  విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్ధిరాస్తి  వివాదాలు పరిష్కరించుకుంటారు.  ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి  దైర్యంగా  ముందుకు సాగుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×