// // Today Horoscope in Telugu: - ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం - వారికి శుభవార్తలు -->
E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి శుభవార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 15వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. 

వృషభం

Advertisement

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి.  జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. 

మిథునం

ఆత్మీయుల  ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం

Advertisement

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

సింహం

వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య

ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలుంటాయి. ధనవ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.  వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో  సమస్యలు ఓర్పుతో అదిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. 

ధనుస్సు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ పెరుగుతుంది.

మకరం

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆధరణ పెరుగుతుంది. బంధు మిత్రుల ఆధరణ పెరుగుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

కుంభం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీనం

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.  సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.  దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×