E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 29: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 29: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. 

వృషభం

Advertisement

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

మిథునం

ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. 

కర్కాటకం

Advertisement

బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

సింహం

దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. 

ధనుస్సు

పాత ఋణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

మకరం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

కుంభం

నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×