// // Zodiac signs: - పుట్టుకతోనే ఆ రాశుల జాతకులకు దైవ శక్తులు వస్తాయట - ఏ రాశుల వారో తెలుసా..? -->
E-Paper
Advertisement

Zodiac signs: పుట్టుకతోనే ఆ రాశుల జాతకులకు దైవ శక్తులు వస్తాయట – ఏ రాశుల వారో తెలుసా..?

Zodiac signs: పుట్టుకతోనే ఆ రాశుల జాతకులకు దైవ శక్తులు వస్తాయట – ఏ రాశుల వారో తెలుసా..?
Advertisement

Zodiac signs: పుట్టుకతోనే కొన్ని రాశుల వారికి దైవ అనుగ్రహంతో పాటు దైవిక శక్తులు అబ్బుతాయట. వారిపై దేవుడి ఆశీస్సులు దండిగా ఉంటాయట అయితే ఆ రాశుల జాతకులు ఎవరు..? ఇంకా ఆ రాశుల్లో పుట్టిన వారి ప్రత్యేకతలు ఏంటి..? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుకతోనే ఆధ్యాత్మిక చింతన, అంతర్‌జ్ఞానం (Intuition), దైవ అనుగ్రహం కొన్ని రాశుల వారికి సహజంగానే ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా పంచ భూతాలలో ‘జల తత్వం’ కలిగిన రాశుల వారు దైవ శక్తికి దగ్గరగా ఉంటారట. ఆ రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మీన రాశి (Pisces): రాశి చక్రంలో చివరి రాశి అయిన మీన రాశికి అధిపతి గురువు (Jupiter). వీరికి పుట్టుకతోనే దైవ భక్తి మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందట. వీరికి రాబోయే పరిణామాలను ముందుగానే పసిగట్టే శక్తి (Sixth Sense) ఉంటుందట. పరోపకార గుణం, జాలి దయ వీరిలో మెండుగా ఉండటం వల్ల దైవ శక్తి వీరికి రక్షణగా ఉంటుందని పండితులు చెప్తున్నారు.

వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశికి అధిపతి కుజుడు కానీ దీనికి అంతర్లీనంగా ఉండే శక్తి చాలా నిగూఢమైనదట. వృశ్చిక రాశి వారు రహస్య విద్యలు, మంత్ర శాస్త్రం మరియు ఆధ్యాత్మిక లోతుల్ని త్వరగా అర్థం చేసుకోగలరట. వీరి చూపు చాలా శక్తివంతంగా ఉంటుందట. ఎదుటివారి మనసులో ఏముందో గ్రహించగల అద్భుతమైన దైవదత్తమైన శక్తి వీరికి ఉంటుందట.

Advertisement

కర్కాటక రాశి (Cancer): ఈ రాశికి అధిపతి  చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. అందుకే ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను కోరుకుంటారట. అలాగే నిరంతరం దైవ నామ స్మరణలో ఉండటానికి ఇష్టపడతారట. వీరికి కులదైవం లేదా ఇష్టదైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. కష్టకాలంలో వీరికి ఏదో ఒక రూపంలో సహాయం అందుతుందట.

ధనస్సు రాశి (Sagittarius): ఈ ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు ధర్మాన్ని పాటించేవారట. వీరు పుట్టుకతోనే ఉన్నతమైన విలువలు కలిగి ఉంటారట. దేవాలయాలు సందర్శించడం, శాస్త్రాలను అధ్యయనం చేయడం వీరి సహజ లక్షణమట. వీరి మాట తీరులో ఒక రకమైన దైవిక శక్తి కనిపిస్తుందట.

కుంభ రాశి (Aquarius): కుంభ రాశికి అధిపతి శని దేవుడు. కుంభ రాశి వారు దార్శనికులు. లోక కల్యాణం కోసం ఆలోచించే గుణం వీరికి ఎక్కువగా ఉంటుందట. సాధారణ మనుషులకు అందని విషయాలను వీరు మేధస్సుతో, దైవ చింతనతో గ్రహించగలరట.

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి ఒక్కటే కాకుండా, జాతక చక్రంలో  9వ ఇల్లు (భాగ్య స్థానం) మరియు 5వ ఇల్లు (పూర్వ పుణ్య స్థానం) బలంగా ఉన్నవారికి పుట్టుకతోనే దైవ శక్తులు లేదా అదృష్టం తోడవుతాయట. అలాగే వ్యక్తి చేసే మంచి పనులు (కర్మ) కూడా ఈ శక్తులను ప్రభావితం చేస్తాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కొన్ని లక్షల మంది పాల్గొన్న కురుకేత్ర యుద్దం తర్వాత మిగిలింది ఎంత మందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×