// // Zodiac signs: - భార్యలను బాధపెట్టే భర్తలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట -->
E-Paper
Advertisement

Zodiac signs: భార్యలను బాధపెట్టే భర్తలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట

Zodiac signs: భార్యలను బాధపెట్టే భర్తలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట
Advertisement

Zodiac signs: భార్యలను బాధపెట్టే భర్తలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట. ఆ రాశులలో పుట్టిన మగవారే ఎక్కువగా తమ భార్యలను అనుమానించడం.. వారిపై నిఘా ఉంచడం లాంటి జుగుప్సాకరమైన అలవాట్లు కలిగి ఉంటారట. అయితే ఏ రాశులలో పుట్టిన వారికి ఇలాంటి అలవాట్లు ఉంటాయో.. అలాగే పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి వారి భార్య మీద ఎంత పర్సంటేజ్ ప్రేమ ఉంటుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధారణంగా ఏ రాశిలో పుట్టిన వారైనా తమ స్వభావం, పెరిగిన వాతావరణం మరియు వ్యక్తిగత విలువలపై ఆధారపడి ప్రవర్తిస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఉండే విలక్షణమైన లక్షణాలు (ఉదాహరణకు: మొండితనం, కోపం లేదా భావాలను వ్యక్తపరచలేకపోవడం) ఒక్కోసారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులకు కారణం కావచ్చని చెబుతుంటారు పండితులు. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణల ప్రకారం ఈ క్రింది రాశుల వారిలో కనిపించే కొన్ని లక్షణాలు భాగస్వామికి ఇబ్బందిగా అనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశిలో పుట్టిన భర్తలు చాలా రహస్యంగా ఉంటారట.. అలాగే కొన్నిసార్లు అతిగా అనుమానించే (Possessive) స్వభావం కలిగి ఉంటారట. ఇది వారి భాగస్వామికి మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు.

మేష రాశి (Aries): మేష రాశిలో పుట్టిన మగవారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుందట. వీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు లేదా అనే మాటలు భార్యల మనసును కష్టపెడతాయట. అయితే ఆవేశంలో ఎంత మాట్లాడినా తర్వాత చాలా కూల్‌ అయిపోతారట ఈ రాశిలో పుట్టిన వారు.

Advertisement

మకర రాశి (Capricorn): మకర రాశిలో పుట్టిన మగవారు ఎక్కువగా పనికి  ప్రాధాన్యత ఇస్తారట (Workaholics). దీనివల్ల కుటుంబానికి లేదా భార్యకు తగినంత సమయం కేటాయించలేకపోవడం వల్ల భార్యతో  ఇబ్బందులు వస్తాయట. దీంతో వీరు భార్యలను తిట్టి వారిని బాధపెడతారట.

మిథున రాశి (Gemini): మిథున రాశిలో పుట్టిన వారు ద్వంద్వ స్వభావం వల్ల ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టమవుతుందట. వీళ్లు మాట మార్చడం లేదా సరైన స్పష్టత ఇవ్వకపోవడం వల్ల భాగస్వామిని కలవరపెట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు.

ఇక సింహ రాశి వారు 85 శాతం బాధపెడితే కన్యా రాశిలో పుట్టిన భర్తలు 60 శాతం, ధనస్సు రాశిలో పుట్టిన భర్తలు 55 శాతం, కుంభ రాశిలో పుట్టిన మగవారు 50 శాతం, వృషభ రాశిలో పుట్టిన భర్తలు 40శాతం, తులా రాశిలో పుట్టిన భర్తలు 35 శాతం, కర్కాటక రాశిలో పుట్టిన భర్తలు 30 శాతం మీన రాశిలో పుట్టిన భర్తలు 25 శాతం మాత్రమే భార్యలను బాధపెడతారట.

జ్యోతిష్యం అనేది కేవలం ఒక సూచిక మాత్రమే. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది పూర్తిగా వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. అన్ని రాశుల వారిలోనూ మంచి భర్తలు ఉంటారు. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం మరియు ప్రేమ ఉన్నచోట రాశులతో సంబంధం లేకుండా వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపపు వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుందో తెలుసా… ?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×