// // Luckt Mobile Number: - మీ మొబైల్ నెంబర్ చివరన ఆ సంఖ్యలు ఉంటే కోట్లు సంపాదిస్తారట -->
E-Paper
Advertisement

Luckt Mobile Number:  మీ మొబైల్ నెంబర్ చివరన ఆ సంఖ్యలు ఉంటే కోట్లు సంపాదిస్తారట

Luckt Mobile Number:  మీ మొబైల్ నెంబర్ చివరన ఆ సంఖ్యలు ఉంటే కోట్లు సంపాదిస్తారట
Advertisement

Luckt Mobile Number:  మీ మొబైల్‌ నెంబర్‌ చివరలో ఆ సంఖ్యలు ఉంటే మీ దశ తిరిగిపోతుందట. ఎన్ని కష్టల్లో ఉన్నా మీరు చేస్తున్న వ్యాపారాలు వృద్దిలోకి వస్తాయట. నిదానంగా మీ వ్యాపారాలు లాభాల బాట పడతాయట. అతి త్వరలోనే మీరు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారట.

న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నంబర్ చివర ఏ అంకెలు ఉంటే ధనవంతులు అవుతారనేది చెప్పబడిందట. సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలు విజయాన్ని, సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయట. ఆ సంఖ్యలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement

సంపదను పెంచే అదృష్ట సంఖ్యలు: మీ మొబైల్ నంబర్ చివరన ఈ అంకెలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుందని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు వాటిలో మొదటి సంఖ్య ఒకటి. ఇది సూర్యుడికి చిహ్నం. ఈ సంఖ్య మొబైల్‌ చివరలో ఉంటే నాయకత్వ లక్షణాలను, అధికారాన్ని, వ్యాపారంలో విజయాన్ని ఇస్తుందట. ఇక రెండవ సంఖ్య 6. ఇది శుక్రుడికి (Venus) చిహ్నమట. విలాసవంతమైన జీవితాన్ని, సంపదను మరియు భోగభాగ్యాలను ఈ సంఖ్య  ప్రసాదిస్తుందట. నంబర్ చివరలో 6 ఉండటం చాలా మంది ధనవంతుల ఎంపికగా చెప్తుంటారు న్యూమరాలజిస్టులు. ఇక మూడవ సంఖ్య ఎనిమిది. ఇది శని దేవునికి చిహ్నం. కష్టపడి పని చేసే తత్వాన్ని, స్థిరాస్తిని మరియు భారీ ఆర్థిక లాభాలను ఇస్తుందట. అయితే, ఇది అందరికీ సెట్ అవ్వదు..  మీ పుట్టిన తేదీకి అనుకూలంగా ఉంటేనే ఇది కోట్లు సంపాదిస్తుందట. ఇక చివరి సంఖ్య తొమ్మిది. ఇది కుజుడికి చిహ్నం. అదృష్టాన్ని, ధైర్యాన్ని మరియు సామాజిక హోదాను ఈ నెంబర్‌ ఇస్తుందట.

ముఖ్యమైన కాంబినేషన్లు: కేవలం ఒక్క అంకె మాత్రమే కాకుండా, చివరి రెండు లేదా మూడు అంకెలు ఈ క్రమంలో ఉంటే మంచిదని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. అవి 1, 6, 9 ఈ అంకెలు కలిపి రావడం (ఉదాహరణకు 169, 961) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ఇస్తుందట. అలాగే 888 లేదా 999. ఇలా వస్తే కూడా ఆ అంకెలు ఎనర్జీని పెంచి, విజయ అవకాశాలను మెరుగుపరుస్తాయట.

Advertisement

ఏ అంకెలు ఉండకూడదు?: సాధారణంగా మొబైల్ నంబర్ చివర 0, 2, 4 వంటి అంకెలు ఉండటం అంత మంచిది కాదని కొందరు నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ‘0’ చివరన ఉంటే అది ఫలితాలను శూన్యం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

అసలు రహస్యం: మొబైల్ నంబర్ చివరి అంకె కంటే, ఆ పది అంకెల మొత్తం (Total) ఎంత వస్తుంది అనేది చాలా ముఖ్యట. ఎలాగంటే  మీ మొబైల్ నంబర్‌లోని 10 అంకెలను కూడాలి. పది అంకెలు కూడగా వచ్చిన రెండంకెల సంఖ్యను మళ్ళీ ఒకే అంకె వచ్చే వరకు కూడాలి. అలా వచ్చిన సింగిల్ డిజిట్ నెంబర్‌ మీ పుట్టిన తేదీకి (Destiny Number) అనుకూలంగా ఉండాలి. ఇలా ఉంటే చాల మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంఖ్యాశాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మొబైల్ నంబర్ మార్చినంత మాత్రాన కోట్లు రావు, దానికి తగ్గ కష్టం మరియు ప్రణాళిక కూడా తోడవ్వాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: అక్కడ పుట్టుమచ్చ ఉంటే కోట్లు సంపాదిస్తారట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×