// // Brahmamgari Kalagnanam: - బ్రహ్మంగారి కాలజ్ఞానం - 2126లో ఒళ్ళు జలదరించే సంఘటనలు జరుగుతాయట -->
E-Paper
Advertisement

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం – 2126లో ఒళ్ళు జలదరించే సంఘటనలు జరుగుతాయట

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం – 2126లో ఒళ్ళు జలదరించే సంఘటనలు జరుగుతాయట
Advertisement

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2126వ సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసా…? మనుషులు ఎలా మారిపోతారో తెలుసా..? ధర్మం, నీతి అనే పదాలు కనీసం డిక్షనరీలో కూడా కనిపించకుండా పోతాయట. ఇంతకీ 2126 గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే వంద సంవత్సరాల కాలం (అంటే సుమారు 2126 నాటికి) భూమిపై విపరీతమైన మార్పులు సంభవిస్తాయని ఆయన వివరించారు. ఆయన చెప్పిన భవిష్యవాణి ప్రకారం రాబోయే కాలంలో ప్రపంచం ఎలా ఉండబోతుందోనన్న  కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ధర్మం పూర్తిగా నశించడం: బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం, కలియుగంలో మరో వందేళ్లు ముగిసే సమయానికి మానవ సంబంధాలు, విలువలు పూర్తిగా అంతరించిపోతాయట. కుటుంబ వ్యవస్థ అనేది కనుమరుగు అవుతుందట. తల్లిదండ్రులను పిల్లలు, భర్తను భార్య గౌరవించని పరిస్థితులు వస్తాయట. ఒకే ఇంట్లో ఉన్నా మనుషుల మధ్య నమ్మకం ఉండదట. ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు కేవలం విహారయాత్ర స్థలాలుగా మారిపోతాయట. నిజమైన భక్తి కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారట.

ప్రకృతి వైపరీత్యాలు – ప్రళయ సంకేతాలు: వంద సంవత్సరాల తర్వాత ప్రకృతి తన స్వరూపాన్ని మార్చుకుంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారట. జల ప్రళయం వచ్చి  సముద్రాలన్ని  ఉప్పొంగి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతాయట. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు నీట మునుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారట. అలాగే ఆకాశంలో వింతలు విచిత్రాలు జరుగుతాయట. ఆకాశం నుండి అగ్ని వర్షం కురిసినట్లుగా ఎండలు ఉంటాయట.. అలాగే పగటి పూట కూడా నక్షత్రాలు కనిపిస్తాయట..

Advertisement

శారీరక మార్పులు – అల్పాయుష్షు: మానవ శరీరంలో కూడా వింతైన మార్పులు చోటు చేసుకుంటాయట. మనుషుల ఎత్తు, వయస్సు క్రమంగా తగ్గిపోతుందట. 10-12 ఏళ్లకే వివాహాలు జరుగుతాయట. 30 ఏళ్లు రాగానే ముసలితనం వచ్చి మనుషులు చనిపోతారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారట. గాలి ద్వారా, నీటి ద్వారా కొత్త కొత్త రోగాలు వచ్చి మనుషులు పిట్టల్లా రాలిపోతారట.

వీరభోగ వసంతరాయల రాక: ఇంకో వంద ఏళ్ల తర్వాత కల్కి (వీరభోగ వసంతరాయలు) తన ప్రభావాన్ని పూర్తిస్థాయిలో చూపిస్తానని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారట. అప్పుడు అయన ఈ లోకంలో ఉన్న అధర్మాన్ని, అవినీతిని అంతం చేయడానికి పంతం పడతారని..  ఖడ్గం చేతబూని అన్యాయాన్ని అతం చేస్తారని చెప్పారట.

బంగారు యుగం (సత్యయుగం) ప్రారంభం: వీరభోగవసంత రాయలుగా వచ్చిన బ్రహ్మంగారు భూమి మీద కలియుగం అయిపోవడానికి నాంది పలుకుతాడట. ఆ తర్వాత భూమి మీద సత్యయుగం ప్రారంభవుతుందట. అప్పుడు మనుషులు మళ్లీ ధర్మబద్ధంగా జీవిస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారట.

బ్రహ్మం గారు చెప్పినట్టు రాబోయే కాలం చాలా కఠినంగా ఉంటుంది. కేవలం సత్యం, అహింస, భక్తి మార్గంలో నడిచేవారు మాత్రమే ఆ కష్టాల నుండి బయటపడతారని బ్రహ్మంగారు చెప్పినట్టు పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గరుడపురాణం ప్రకారం తప్పు చేసిన మనిషి మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×