// // Heinrich Klassen - భారీగా ఎగబడిన ఫ్యాన్స్.. షాకైన క్రికెటర్లు (వీడియో వైరల్) -->
E-Paper
Advertisement

Heinrich Klassen: భారీగా ఎగబడిన ఫ్యాన్స్.. షాకైన క్రికెటర్లు (వీడియో వైరల్)

Heinrich Klassen: భారీగా ఎగబడిన ఫ్యాన్స్.. షాకైన క్రికెటర్లు (వీడియో వైరల్)
Advertisement

Heinrich Klassen: ప్రముఖ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కీపర్ హెన్‌రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2024లో అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. బౌండరీలు కొడుతూ తన దేశంలోనే కాదు.. ఇండియాలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, క్లాసెస్ తన సహచరులతో కలిసి హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ కు వచ్చాడు. అయితే ఈ క్రికెటర్లను గమనించిన ప్రేక్షకులు, అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు.

అనంతరం ఆ క్రికెటర్లను అభిమానంతో చుట్టుముట్టారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో వారు ఒక్కసారిగా అవక్కయ్యారు. ఈ విధంగా ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో ఆశ్చర్యపోయారు. ఫ్యాన్స్ అక్కడి వస్తూనే ఉన్నారు తప్ప తగ్గడంలేదు. ఫ్యాన్స్ భారీగా ఎగబడుతూ ఫొటోలు తీసుకున్నారు. దీంతో వారు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఫ్యాన్స్ ఎగబడుతూ వారితో సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం, క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోతూ కొంత నిరుత్సాహానికి గురవుతున్న దృశ్యం కనిపిస్తుంది.

Advertisement

Also Read: లేట్‌గా వచ్చిందని టీచర్‌పై ప్రిన్సిపల్ దాడి.. వీడియో వైరల్!

కాగా, ఈ సీజన్ లో మ్యాచ్ తరువాత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లను చేయడంలో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్సార్ హెచ్ ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు మరియు నికర రన్ రేట్ ప్లస్ 0.072తో 4వ స్థానంలో ఉంది. లీగ్ దశలో 4 మ్యాచ్ లు మిగిలి ఉన్నందున ఎస్సార్ హెచ్ తమ మిగిలిన మ్యాచ్ లలో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్ లకు చేరుకోవడానికి అవకాశం ఉంది. సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తలపడనున్నది.

Advertisement

 

Tags

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

Advertisement
×