E-Paper
Advertisement

Karimnagar: సర్పంచ్ పదవి కోసం హడావిడి పెళ్లి.. కట్ చేస్తే చివరకు..

Karimnagar: సర్పంచ్ పదవి కోసం హడావిడి పెళ్లి.. కట్ చేస్తే చివరకు..
Advertisement

Karimnagar: తన భార్యను సర్పంచ్‌ పదవిలో చూడాలని ఆశపడ్డ ఓ యువకుడికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో…ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడిన అతడు…పెళ్లి చేసుకుని. తన అర్థాంగిని సర్పంచ్‌ చేయాలనుకున్నాడు. హడావుడిగా పెళ్లి చేసుకుని. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్లాన్ వేశాడు. అయితే సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలంటే ఊర్లో ఓటర్‌గా నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఓటర్ నమోదులో ఆలస్యం కావడంతో…ఇప్పుడు ఆ యువకుడు కుటుంబానికి సర్పంచ్ పదవి దూరమైంది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామానికి చెందిన శంకర్‌కు సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆసక్తి ఉండేది. అయితే గ్రామంలో పదవి ఎస్సీ మహిళగా రిజర్వ్ అయింది. దీంతో ఎలాగైనా తన కుటుంబానికి సర్పంచ్‌ పదవి దక్కాలని భావించిన శంకర్.. ఉన్న ఫలంగా పెళ్లి చేసుకుని. పోటీలో తన భార్యను నిలబెట్టానుకున్నాడు. హడావుడిగా ఈ నెల 26న నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహమాడాడు. అనంతరం ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించాలనుకున్నాడు. కానీ తానోకటి తలిస్తే..దేవుడు మరోలా తలిచినట్లు…శంకర్ తన భార్య పేరును ఓటర్‌గా నమోదు చేయడంలో ఆలస్యం వహించాడు. ఈ ఆలస్యమే. అతని ఆశలకు గండికొట్టింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ జాబితాలో నమోదైన వారికే పోటీ చేయడానికి అర్హత ఉండటంతో.. శంకర్‌…గడువులోగా నమోదు చేయించ లేకపోయాడు. దీంతో శంకర్ భార్య పోటీ చేయడానికి అర్హత సంపాదించలేదు. సర్పంచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శంకర్ తన ఆశలు అడియాశలు కావడంతో నిరాశలో మునిగిపోయాడు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×