E-Paper
Advertisement

Maharashtra: నా అడ్డాలో మీకేం పని.. నడి రోడ్డుపై పులి హల్ చల్

Maharashtra: నా అడ్డాలో మీకేం పని.. నడి రోడ్డుపై పులి హల్ చల్
Advertisement

Maharashtra:  మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై పెద్ద పులి హల్‌చల్ చేసింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెుహర్లీ వెళ్లే ప్రధాన రహదారిపై ఓ పెద్ద పులి రోడ్డుమీదకు రావడంతో వాహనదారులు భయంతో షాక్‌కు గురై తమ వాహనాలను నిలిపివేశారు. పులి అక్కడే తిష్ట వేసి ఉండటంతో ఎవరూ ముందుకు కదల లేకపోయారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చంద్రాపూర్ జిల్లా దట్టమైన అడవీ ప్రాంతం కావడంతో.. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అనేక క్రూర మృగాలు రహదారులపై తిరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌గా అటవీ అధికారులు తెలిపారు. ఇక్కడి రోడ్లపై ప్రయాణించే వారు హారన్లు మోగించకుండా నిశ్శబ్దంగా వెళ్లాలని..  గతంలో కూడా ఈ మార్గంలో మృగాల దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి రహదారి దాటుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×