E-Paper
Advertisement

Finance Agents: మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. మహిళ బలి.. రూ.20 వేలు కట్టలేదని!

Finance Agents: మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. మహిళ బలి.. రూ.20 వేలు కట్టలేదని!
Advertisement

Finance Agents:  ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలైంది. మెరక్ జిల్లాలోని తూప్రాన్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు బ్యాంక్ నుండి 70,000 అప్పు తీసుకుంది. సుమారు 20,000 బకాయి ఉండటంతో ,ఫైనాన్స్ సిబ్బంది ఆమెను తీవ్రంగా వేధించారు. డబ్బు కట్టక పోతే చచ్చిపో అని కఠిన పదాలతో మాట్లాడారు. ఈరోజు ఉదయం మరోసారి ఇంటికి వచ్చిన బ్యాంక్ సిబ్బంది డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో వరలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఫైనాన్స్ సిబ్బంది వేధింపుల వల్లే వరలక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

B

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×