E-Paper
Advertisement

Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొన్న లారీ.. స్పాట్లోనే తండ్రి, కూతురు

Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొన్న లారీ.. స్పాట్లోనే తండ్రి, కూతురు
Advertisement

Road Accident:  హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మల్కాజ్‌గిరికి చెందిన శ్రీశైలం, ఆయన కూతురు సుభిక్ష మృతి చెందడం విషాదకరం. తిరుపతి వెళ్లేందుకు రెండు కుటుంబాలు కారులో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా రాంగ్‌సైడ్‌లోకి వచ్చిన లారీ అకస్మాత్తుగా వారి దారిలోకి దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు అదుపు తప్పి ముందున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుభిక్ష అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రమైన గాయాలతో ఆస్పత్రికి తరలించిన శ్రీశైలం చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×