E-Paper
Advertisement

టైంపాస్ కోసం ఏకంగా విమానాన్ని తయారు చేసిన యూట్యూబర్, నిజంగా వండర్ భయ్యా!

టైంపాస్ కోసం  ఏకంగా విమానాన్ని తయారు చేసిన యూట్యూబర్, నిజంగా వండర్ భయ్యా!
Advertisement

భారీ విమానాలను ఇష్టపడే చాలా మంది చిన్న చిన్న రిమోట్ కంట్రోల్ విమానాలను తయారు చేసి హాబీగా ఎగరేస్తుంటారు. కానీ, యూట్యూబర్ రామీ RC  భిన్నంగా ఆలోచించాడు. అతడు ప్రపంచంలోనే అతిపెద్ద RC ఎయిర్‌ బస్ A380 మోడళ్లలో ఒకదాన్ని తయారు చేసి నిజంగానే గాల్లోకి ఎగురవేశాడు. అంతేకాదు, లుఫ్తాన్సా ఎయిర్‌ లైన్స్ 100వ వార్షికోత్సవ స్పెషల్ కలర్స్ తో దాన్ని అలంకరించి మరింత ఆకట్టుకునేలా చేశాడు.

ఏకంగా 29 అడుగుల పొడవైన విమానం తయారీ

ఈ RC విమానం పరిమాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీని పొడవు సుమారు 29 అడుగులు కాగా, రెక్కల వెడల్పు 32 అడుగులు ఉంది. అంటే, సాధారణ చిన్న విమానాల పరిమాణానికి దగ్గరగా ఉంటుంది. మొత్తం బరువు దాదాపు 800 పౌండ్లు, అంటే సుమారు 362 కిలోలు. ఈ విమానం నిర్మాణంలో అద్భుతమైన ఇంజనీరింగ్ విధానాన్ని ఫాలో అయ్యాడు. ఇందులో మొత్తం 39 సర్వోలు, 5 యాక్యుయేటర్లు అమర్చారు. వీటి సాయంతో ఫ్లాప్‌లు, ల్యాండింగ్ గేర్ డోర్లు, స్పాయిలర్లు ఏర్పాటు చేశాడు. రెక్కల కింద నాలుగు భారీ ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్లు అమర్చారు. ఇవి దాదాపు 500 పౌండ్ల థ్రస్ట్‌ ను ఉత్పత్తి చేస్తాయి. సో, ఈ భారీ మోడల్ నిజమైన విమానం మాదిరిగానే గాల్లోకి ఎగురుతోంది.

Advertisement

ఇందులో ప్రత్యేకంగా పనిచేసే థ్రస్ట్ రివర్సర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. నిజమైన ఎయిర్‌ బస్ A380లో ఉండే లాగే ఇది పని చేస్తుంది. విమానం ల్యాండింగ్ సమయంలో వేగం తగ్గించడానికి ఈ సిస్టమ్ సాయపడుతుంది. అలాగే 12 చక్రాలతో కూడిన ల్యాండింగ్ గేర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి చక్రానికి విడివిడిగా బ్రేకింగ్ సిస్టమ్ కూడా అమర్చారు.

లుఫ్తాన్సా 100వ వార్షికోత్సవ స్పెషల్ పెయింట్

ఈ భారీ RC విమానానికి రంగులు వేయడం కూడా చిన్న పని కాదు. లుఫ్తాన్సా 100వ వార్షికోత్సవ ప్రత్యేక పెయింట్ స్కీమ్‌ ను పూర్తి చేయడానికి దాదాపు నెలన్నర సమయం పట్టింది. ప్రత్యేక బృందం కార్బన్, కాంపోజిట్ బాడీపై జాగ్రత్తగా ఈ రంగులను వేసింది. పెయింటింగ్ పూర్తయ్యేలోపే ఈ విమానం ఐదుసార్లు ట్రయల్స్ పూర్తి చేసింది. ఆరో ప్రయాణంలో చిన్న ప్రమాదం జరిగింది. పూర్తి లుఫ్తాన్సా రంగులతో చేసిన మొదటి ఫ్లైట్ సమయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం  చెట్టును తాకింది. అదృష్టవశాత్తూ పెద్ద నష్టం ఏమీ జరగలేదు. పైలట్ సురక్షితంగా దాన్ని ల్యాండ్ చేయగలిగాడు.

గంటకు 103 మైళ్ల వేగంతో ప్రయాణం

Advertisement

ఆ తర్వాత ఈ భారీ RC విమానం అద్భుతంగా ఎగిరింది. గంటకు 103 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ల్యాండింగ్ లైట్లు, ఫ్లాప్‌లు, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ సరిగ్గా పని చేశాయి. గాల్లో ఇది నిజమైన ఎయిర్‌ బస్ A380లా కనిపించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తి ఉంటే అసాధ్యమేమీ కాదని ఈ భారీ RC విమానంతో చూపించాడు యూట్యూబర్ రామీ.

Read Also: రాత్రి కూడా పగలే.. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 8 ప్రాంతాలు ఇవే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×