E-Paper
Advertisement

Train Ticket Rules: జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కోచ్ లో వెళ్లొచ్చు, సింఫుల్ గా ఇలా చేస్తే సరిపోతుంది!

Train Ticket Rules: జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కోచ్ లో వెళ్లొచ్చు, సింఫుల్ గా ఇలా చేస్తే సరిపోతుంది!
Advertisement

Indian Railway Journey: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు ఈజీగా జర్నీ చేసే అవకాశం కల్పించేందుకు రకరకాల రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఆన్ లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నది. రైలు ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా కన్ఫార్మ్ టికెట్ పొందే వెసులుబాటును అందిస్తున్నది. అయితే, కొన్నిసార్లు మీరు అర్జంట్ గా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ, టికెట్స్ అందుబాటులో ఉండవు. అలాంటి సమయంలో సింఫుల్ గా ఓ పని చేస్తే, రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

జనరల్ టికెట్ తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణం

Advertisement

అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉండి, టికెట్స్ అందుబాటులో లేని సమయంలో జనరల్ టికెట్ తీసుకోని, రిజర్వేషన్ కోచ్ లో జర్నీ చేసే వీలుంటుంది. అలాంటి సమయంలో సింఫుల్ గా ఓ పని చేయాలి. ముందుగా మీరు IRCTC యాప్ ఓపెన్ చేయాలి. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రైన్ నెంబర్, బోర్డింగ్ స్టేషన్, జర్నీ డేట్ ఎంటర్ చేసి, గెట్ డీటైల్స్ మీద ట్యాప్ చేయాలి. ఆ సమయంలో రైల్లో అందుబాటులో ఉన్న సీట్ నెంబర్లు అన్నీ డిస్ ప్లే అవుతాయి. వెంటనే స్టేషన్ లోని టికెట్ సెంటర్ కు వెళ్లి, ఖాళీగా ఉన్న సీట్లలో మీకు నచ్చింది బుక్ చేయగలరేమో అక్కడి సిబ్బందిని అడగాలి. రిజర్వేషన్ చేయడం కుదురుతుందని చెప్తే హ్యాపీగా కన్ఫార్మ్ టికెట్ తీసుకోవచ్చు. ఒకవేళ చేయడం కుదరదని చెప్తే, జనరల్ టికెట్ తీసుకోండి. రైలు ఎక్కి ఖాళీగా ఉన్న సీటు దగ్గరికి వెళ్లి కూర్చోండి. టీసీ వచ్చాక రిక్వెస్ట్ చేసి, ఆ సీటు అమౌంట్ పే చేయండి. హ్యాపీగా జర్నీ చేయండి.

Read Also: దేశంలో పట్టాలెక్కిన తొలి రైలు ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందంటే?

Advertisement

స్లీపర్ టికెట్ తో థర్డ్ ఏసీలో ప్రయాణం చేసే అవకాశం

ఇక రైలు టికెట్లు బుక్ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు టికెట్ బుక్ చేసిన ప్రతి సారి కన్సిడర్ ఫర్ ఆటో అప్ గ్రెడేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే.. ఉదాహారణకు మీరు స్లీపర్ లో టికెట్ బుక్ చేసున్నారు అనుకోండి. రైలు ప్రయాణానికి కొద్ది గంటల ముందు  ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ సమయంలో థర్డ్ ఏసీలో ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే.. మిమ్మల్ని అక్కడికి పంపిస్తారు. అయితే, ఇందుకోసం ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. సో, ఇకపై రైలు టికెట్ బుక్ చేసే సమయంలో కచ్చితంగా ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. స్లీపర్ టికెట్ తో ఏసీలో ఎంజాయ్ చేస్తూ వెళ్లండి. ఈ విషయాలు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. వారు కూడా రైలు జర్నీ ఎంజాయ్ చేసేలా చూడండి!

Read Also: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×