E-Paper
Advertisement

Longest Non-Stop Flight: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!

Longest Non-Stop Flight: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!
Advertisement

World’s Longest Non-Stop Flight: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే విమానాలు చాలా ఉన్నాయి. కానీ, వచ్చే ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం అందుబాటులోకి రాబోతోంది. ఈ విమానం ఏకంగా ఒక్క స్టాప్ లేకుండా 10 వేల మైళ్లకు పైగా ప్రయాణించనుంది. ఇంతకీ ఆ విమానం ఏది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సిడ్నీ నుంచి లండన్, న్యూయార్క్ కు..

ఆస్ట్రేలియన్ ఎయిర్ క్యారియర్ క్వాంటాస్ అతి పొడవైన కమర్షియల్ విమానాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ విమానాలు సిడ్నీ నుంచి లండన్, న్యూయార్క్ కు ప్రయాణించనున్నాయి. ఈ విమానాలు సింగిల్ స్టాప్ లేకుండా 10 వేల మైళ్లకు పైగా ప్రయాణించనున్నాయి.

ప్రాజెక్ట్ సన్‌ రైజ్‌ లో భాగంగా..

Advertisement

క్వాంటాస్ ప్రాజెక్ట్ సన్ రైజ్ లో భాగంగా ఈ మార్గాలు 2027 ఫస్ట్ హాఫ్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేయబడిన ఎయిర్‌ బస్ A350-1000ULR (అల్ట్రా లాంగ్ రేంజ్) విమానాలను ఉపయోగించనుంది. ఈ ప్రయాణాలు ఒక్కోటి దాదాపు 22 గంటలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ విమానంలో వెళ్లే ప్రయాణీకులు, రెండు సూర్యోదయాలను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు లాంగ్ రేంజ్ విమానాలు మధ్యలో ఎక్కడో ఒకచోట ఆగి ఇంధనాన్ని నింపుకునేవి. కానీ, ఈ విమానాలు ఏకబిగిన ప్రయాణాన్ని కొనసాగించనున్నాయి. ఈ కొత్త నాన్ స్టాప్ విమానాలు సిడ్నీని లండన్ (10,573 మైళ్ళు), న్యూయార్క్ (10,100 మైళ్ళు) నగరాలను కలుపుతాయి. ప్రస్తుతం ఉన్న స్టాప్‌ ఓవర్లను తొలగించడం వలన ప్రయాణ సమయం నాలుగు గంటల వరకు తగ్గనుంది.

2017లో ప్రాజెక్ట్ సన్‌ రైజ్‌ ప్రారంభం

క్వాంటాస్ 2017లో ప్రాజెక్ట్ సన్‌ రైజ్‌ ను ప్రారంభించింది. ఆస్ట్రేలియా తూర్పు తీరం నుంచి లండన్, న్యూయార్క్‌ కు ప్రత్యక్ష విమానాలను నడపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. సెప్టెంబర్ 2024లో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యాంగర్‌ లో జరిగిన క్వాంటాస్ కార్యక్రమంలో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, ఆస్ట్రేలియాకు, అక్కడి నుంచి ఇతర సుదూర దశాలకు ఈ ప్రయాణాలు కొనసాగనున్నాయని క్వాంటాస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెనెస్సా హడ్సన్ వెల్లడించారు.ఈ విమానాలు ప్రయాణ సమయాన్ని నాలుగు గంటల వరకు తగ్గిస్తాయన్నారు.

Advertisement

కొత్త విమానాల ప్రత్యేకత ఏంటంటే?

క్వాంటాస్ మే 2022లో ప్రత్యేకంగా తయారు చేయించిన 12 విమానాలకు ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్లకు అనుకూలంగా ఎయిర్‌ బస్ A350-1000ULRను ఎంపిక చేశారు. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఇంజిన్‌ లను ఏర్పాటు చేయడంతో పాటు 20,000 లీటర్ల ఇంధన ట్యాంక్‌ తో అమర్చబడి ఉంటుంది. ఈ విమానాలు A350 ప్రామాణిక వెర్షన్‌ల కంటే చాలా ఎక్కువ ప్రయాణించగలదు. ఆ విమానాలలో మొదటిది 2026 చివరిలో డెలివరీ చేయబడుతుందని తెలుస్తోంది. ఇక ఈ విమానంలో కేవలం 238 మంది ప్రయాణీకులను మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇందులో 6 ఫస్ట్ క్లాస్ సూట్లు(1-1-1 కాన్ఫిగరేషన్), 52 బిజినెస్ సూట్‌లు (1-2-1 కాన్ఫిగరేషన్), 40 ప్రీమియం ఎకానమీ సీట్లు (2-4-2 కాన్ఫిగరేషన్), 140 ఎకానమీ సీట్లు (3-3-3 కాన్ఫిగరేషన్) ఉంటాయి. అన్ని క్యాబిన్లలో హైస్పీడ్ Wi-Fi ఉంటుంది. తేలికపాటి వ్యాయామం కోసం స్థలం ఉంటుంది.

Read Also: పట్టాల మీద పరుగులు తీసే ప్యాలెస్, ఈ రైళ్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×