E-Paper
Advertisement

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

World’s Fastest Bullet Trains: ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే హైస్పీడ్ రైలు వ్యవస్థల గురించి మాట్లాడితే..ముందుగా గుర్తుకు వచ్చే దేశాలు చైనా, జపాన్, ఫ్రాన్స్. ఈ మూడు దేశాలు బుల్లెట్ రైళ్ల అభివృద్ధిలో చాలా ముందున్నాయి. హైస్పీడ్, టైమ్ మెయింటెనెన్స్, అత్యాధునిక సాంకేతికతతో ఈ దేశాల రైళ్లు కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటితో పాటు ఇటలీ, స్పెయిన్ కూడా హైస్పీడ్ రైలు నెట్‌ వర్క్‌ లో కీలక స్థానాన్ని సంపాదించాయి.

చైనా: ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్

హైస్పీడ్ రైళ్ల విషయంలో చైనా ప్రపంచంలోనే టాప్ లో ఉంది. దేశ వ్యాప్తంగా 45,000 కిలోమీటర్లకు పైగా హైస్పీడ్ రైలు మార్గాలను నిర్మించింది. చైనాకు చెందిన CR400 ఫుక్సింగ్ హావో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కమర్షియల్ బుల్లెట్ రైళ్లలో ఒకటి. ఇది బీజింగ్–షాంఘై మధ్య గంటకు 350 కిలోమీటర్ల వేగంతో సేవలు అందిస్తోంది. చైనాలో మరో ప్రత్యేక ఆకర్షణ షాంఘై మాగ్లెవ్. ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతతో నడిచే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కమర్షియల్ రైలు. ఈ రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. కానీ, ఇంకా అందుబాటులోకి రాలేదు.

జపాన్: బుల్లెట్ రైళ్లకు పుట్టినిల్లు

Advertisement

హైస్పీడ్ రైలు ప్రయాణాన్ని ప్రపంచానికి పరిచం చేసింది జపాన్. 1964లో ప్రపంచంలోనే తొలి బుల్లెట్ రైలు అయిన షింకన్సెన్ సేవలను ప్రారంభించింది.ప్రస్తుతం N700S షింకన్సెన్ గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, E5, H5 షింకన్సెన్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జపాన్ L0 సిరీస్ మాగ్లెవ్ రైలును కూడా పరీక్షిస్తోంది. ఈ రైలు గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఫ్రాన్స్: యూరప్‌ లోనూ హైస్పీడ్ రైల్వే విప్లవం

యూరప్‌లో హైస్పీడ్ రైలు సేవలకు ఫ్రాన్స్ నాంది పలికింది. TGV రైళ్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం TGV POS, TGV Duplex, AGV లాంటి రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో సర్వీసులు అందిస్తున్నాయి. 2007లో ఫ్రాన్స్ నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో TGV రైలు గంటకు 574  కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఇటలీ, స్పెయిన్ లోనూ హైస్పీడ్ రైల్వే సేవలు

Advertisement

హై-స్పీడ్ రైళ్లలో ఇటలీ, స్పెయిన్ కూడా మంచి గుర్తింపు పొందాయి. ఇటలీకి చెందిన ఫ్రెక్సియారోస్సా 1000 రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అలాగే స్పెయిన్‌లో నడిచే AVE Class 103 రైళ్లు కూడా అదే స్థాయి వేగంతో ప్రధాన నగరాలను అనుసంధానిస్తున్నాయి.

Read Also: లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×