E-Paper
Advertisement

వాట్ ఏ ఐడియా సార్ జీ.. భార్యలు షాపింగ్ చేస్తుంటే భర్తలు చేపలు పట్టొచ్చు.. ఎక్కడో తెలుసా?

వాట్ ఏ ఐడియా సార్ జీ.. భార్యలు షాపింగ్ చేస్తుంటే భర్తలు చేపలు పట్టొచ్చు.. ఎక్కడో తెలుసా?
Advertisement

Indoor Fishing Pond: సాధారణంగా చేపలు పట్టడం అంటే చెరువులు, నదులు లేదా సముద్ర తీరాలకు వెళ్తుంటారు. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణంలో గంటల తరబడి వేచి చూస్తూ చేపలు పట్టడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే, ఇప్పుడు ఈ అనుభవాన్ని ఆస్వాదించడానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి వెళ్లి, అక్కడ షాపింగ్ చేస్తూనే చేపలు కూడా పట్టేయొచ్చు. రష్యా రాజధాని మాస్కోలోని ‘గగారిన్స్కీ షాపింగ్ సెంటర్’ ఇలాంటి ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రపంచంలోనే మొదటి ఇండోర్ ఫిషింగ్ పాండ్‌ను ఏర్పాటు చేయబోతోంది.

మాల్ లోపల ఒక చిన్న చెరువు:

ఈ షాపింగ్ మాల్‌లో దాదాపు 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో ఒక కృత్రిమ చెరువును నిర్మించనున్నారు. ఈ నీటి గుంటలో కార్ప్, క్రూసియన్ కార్ప్, టెంచ్, బ్రీమ్, పర్చ్, క్యాట్ ఫిష్ వంటి రకరకాల చేపలను పెంచనున్నారు. ఒకే సమయంలో దాదాపు 16 మంది ఇక్కడ కూర్చుని హాయిగా చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసం కావాల్సిన గాలాలు, ఎరలను మాల్ యాజమాన్యమే అక్కడికక్కడే అందిస్తుంది.

ప్రకృతి ఒడిలో ఉన్న భావన:

Advertisement

ఇది కేవలం ఒక నీటి గుంట మాత్రమే కాదు.. మాల్ లోపల ఒక చిన్న ప్రకృతి ద్వీపంలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కూర్చుని చేపలు పడుతుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో పక్షుల కిలకిలరావాలు, కప్పల బెకబెకలు వినిపిస్తాయి. దీనివల్ల మాల్‌కి వచ్చే సందర్శకులకు అడవిలో లేదా గ్రామీణ వాతావరణంలో ఉన్నంత ప్రశాంతత లభిస్తుంది. షాపింగ్‌తో అలసిపోయిన వారికి ఇది ఒక మంచి రిలాక్సేషన్ అని చెప్పవచ్చు.

Also Read: బియ్యం డబ్బా కథే మళ్లీ రిపీట్.. ఫోన్ ఓవర్ హీటైందని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? కంపెనీల సీరియస్ వార్నింగ్!

నీటి అడుగున అద్భుతం:

Advertisement

ఈ ఇండోర్ చెరువులో మరో ప్రత్యేకత కూడా ఉంది. నీటి లోపల కెమెరాలను అమర్చడం ద్వారా, నీటి అడుగున చేపలు ఎలా తిరుగుతున్నాయి, ఎరను ఎలా నోటికి అందుకుంటున్నాయి అనే దృశ్యాలను బయట ఉన్న పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ఇది నిజంగా చేపలు పట్టే అలవాటు ఉన్నవారి కోసమా, లేక భార్యలు షాపింగ్ చేసేటప్పుడు భర్తలు కాలక్షేపం చేయడం కోసమా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

ఉచితంగా చేపల వేట.. కానీ ఒక కండిషన్:

ఈ చెరువులో చేపలు పట్టడానికి ఎలాంటి రుసుము వసూలు చేయకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. మనం పట్టిన చేపలను ఇంటికి తీసుకెళ్లడానికి వీల్లేదు. వాటిని తిరిగి నీటిలోనే వదిలేయాలి. ఇలా చేపలను పట్టి వదిలేసినందుకు గానూ మాల్ యాజమాన్యం కొన్ని పాయింట్లను బహుమతిగా ఇస్తుంది. ఆ పాయింట్లను ఉపయోగించి మాల్‌లోని ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

వివాదంలో కొత్త ఆలోచన:

మాల్ లోపల చేపలు పట్టే ఈ సరికొత్త ఐడియా అందరినీ ఆకట్టుకుంటున్నప్పటికీ.. జంతు ప్రేమికులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు, వారంలో ఏడు రోజులు చేపల నోటికి గాలాలు గుచ్చడం వాటిని హింసించడమే అవుతుందని వారు వాదిస్తున్నారు. వినోదం పేరుతో మూగజీవులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×