E-Paper
Advertisement

Viral Video: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!

Viral Video: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!
Advertisement

రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలతో పాటు లగేజీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు లాక్కెళ్లడం పక్కా. తాజాగా ఓ మహిళా తన చిన్న బాబుతో కలిసి ప్రయాణిస్తుండగా, దొంగ పర్సును కొట్టేశాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా క్విక్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సదరు మహిళ కోపంతో ఊగిపోయింది. ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న ఆమె, పక్కనే ఉన్న విండోను పగలగొట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తోటి ప్రయాణీకులు వద్దని చెప్పినా..  

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళా ప్రయాణీకురాలు తను ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ విండోను పగలగొట్టే ప్రయత్నం చేసింది. తోటి ప్రయాణికులు ఆమెను ఆపమని చెప్పినప్పటికీ, తన కంపార్ట్‌ మెంట్ కిటికి అద్దాన్ని పదే పదే కొట్టి పగలగొట్టడానికి ట్రై చేసింది.  పక్కనే ఆమె బిడ్డ ఈ ఘటనను చూసి భయపడుతున్నా, పట్టించుకోకుండా ఆమె తన కోపాన్ని వెళ్లగక్కింది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పర్సును ఎవరో దొంగిలించారు. రైల్వే పోలీసుల సమాచారం అదించినా, వారు సాయం చేయకపోవడంతో విసుగు చెందిన ఆ మహిళ రైలు కిటికీని పగలగొట్టడం ద్వారా తన కోపాన్ని బయటపెట్టింది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

Advertisement

అటు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విరిగిన రైలు విండోకు మరమ్మతులు చేసేందుకు అయ్యే ఖర్చును ఆమె నుంచి వసూళు చేయాలంటున్నారు. “పక్కన చంటి బిడ్డ ఉన్నా, ఆమె ఇలా చేయడం సరిగా లేదు. ఆ బిడ్డను ఎవరైనా పక్కకు తీయడం మంచిది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “రైల్వే ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమె నుంచి పరిహారాన్ని వసూళు చేయాలి. ప్రయాణ సమయంలో ఎవరి వస్తువులను వారే జాగ్రత్తగా చూసుకోవాలి. రైల్వే బాధ్యత వహించదనే విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.  “ఆమె మెంటల్ కండీషన్ సరిగా లేనట్టు ఉంది. అందుకే విండో బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి వారిని జీవితాంతం ఏసీ కోచ్‌లలో ఎక్కకుండా బ్లాక్‌ లిస్ట్ చేయాలి. రైల్వేలో కఠినమైన నియమాలు ఉండాలి. ఆమెపై ప్రజా ఆస్తి నష్టపరిహార చట్టం కేసును ప్రయోగించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైల్వే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Read Also: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్‌ ప్రెస్‌..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×