E-Paper
Advertisement

సిద్దిపేట పేరు వెనుక మూడు ఆసక్తికరమైన కథలు!

సిద్దిపేట పేరు వెనుక మూడు ఆసక్తికరమైన కథలు!
Advertisement

Siddipet History: సిద్దిపేట అనగానే మొదటగా గుర్తొచ్చేది కెసిఆర్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదట్లో ఆయన ఇక్కడి నుండే పోటీ చేశారు మరి. ఇక తాజాగా BRS లో కీలక పాత్ర పోషిస్తున్న హరీష్ రావు ఇప్పుడు ఇదే సిద్దిపేటకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుచేత సిద్దిపేట ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. మరి ఇంతగా ప్రాచుర్యం ఉన్న సిద్దిపేటకి అసలు ఆ పేరు ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో డీటైల్డ్‌గా చూద్దాం.

మామూలుగా ఒక ప్రాంతానికి అక్కడ నివసించిన ప్రజల వల్లనో, లేక అక్కడ జరిగిన విషయాలకు గుర్తుగానో, లేక అక్కడ పుట్టిన ప్రముఖులు, వెలసిన దేవాలయాల వల్లనో పేరు వస్తుంది. అయితే సిద్దిపేట పేరు వెనకాల ఒకటి కాకుండా మూడు కథలు ఉండటం ఇక్కడ విశేషం.

Advertisement

మొదటిది సిద్ధులు, యోగులకు సంబంధించిన కథ

చాలా ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద అడవులు, కొండలు, చెరువులు ఉండేవట. అలా ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా కనిపించడంతో సిద్ధులు, యోగులు, ఋషులు తమ ధ్యానం, తపస్సు వంటివి చేసుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చేవారట. అలా ఎక్కువమంది సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం కావడం వల్ల దీన్ని మొదట్లో “సిద్ధుల పేట” అని పిలిచేవారని, ఇక క్రమక్రమంగా సిద్ధుల పేట, సిద్ధుల పేట అంటూ అక్కడి ప్రజల నోట్లో నానీ నానీ చివరికి “సిద్దిపేట”గా స్థిరపడిందని ఇక్కడి పెద్దవాళ్లు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న మాట.

Advertisement

ఇక వినిపిస్తున్న మరో కథ 

వందల ఏళ్ల కిందట ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశానికి వచ్చి కొంతమంది స్థిరపడ్డారని, వారినే “సిద్ధిలు”అని పిలిచేవారని చరిత్ర చెబుతుంది. వారంతా నిజాం రాజుల కాలంలో దక్కన్ ప్రాంతానికి, అంటే హైదరాబాద్, బీదర్ లాంటి చోట్లకు వచ్చారట. ఇక వచ్చిన సిద్ధీలను నిజాం రాజులు తమ సైన్యంలో చేర్చుకుని, తమ కోటలకు, రాజభవనాలకు కాపలా బాధ్యతలు అప్పగించేవారట.

ఇక సైనికులుగా బాధ్యతలు చేపట్టిన ఆ సిద్ధిలకు ఈ ప్రాంతంలో సైనిక క్యాంపులు ఉండేవని, అందుకే వారి పేరు మీద దీన్ని “సిద్ధిల పేట”అని పిలిచేవారని, కాలక్రమంలో అది సిద్దిపేటగా మారిందని కొందరు చరిత్ర పరిశోధకులు అంటారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి రాతి శాసనాలు దొరకపోయినప్పటికీ, ఇది కూడా ఒక ఆసక్తికరమైన కథగా చరిత్రలో మిగిలిపోవడం విశేషం.

ఇక మూడో కథ ఏంటంటే…

‘సిద్ధుడు’ అనే ఒక వ్యక్తి పేరు మీద ఈ ఊరు వచ్చిందంటారు చాలామంది. ఆ రోజుల్లో అక్కడ ఉన్న ‘సిద్ధుడు’అనే ఒక ప్రముఖ వ్యక్తి పేరు మీద మొదట “సిద్ధుడి పేట” అని పిలిచేవారని, ఆ తర్వాత అది సిద్దిపేటగా మారిపోయిందని స్థానికంగా కొందరు చెప్తుంటారు.

ఈ కథల్లో ఏది నిజమైనా, సిద్దిపేటకు వందల ఏళ్ల పాత చరిత్ర ఉందనేది మాత్రం నిజం. కాకతీయుల కాలం నుంచి నిజాంల పాలన వరకు ఈ ఊరు ఎన్నో మార్పులను చూసిందన్నది కాదనలేని సత్యం. ఇక ఇక్కడ వ్యవసాయం బాగా పెరిగి వ్యాపారాలు వృద్ధిలోకి వచ్చాయంటే కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువుల వల్లేనని చరిత్ర పుస్తకాలే సాక్ష్యాలుగా ఉన్నాయి.

మొత్తానికి..

“సిద్దిపేట” అనే పేరు వెనుక ఒకే ఒక కారణం కాకుండా… సిద్ధుల తపస్సు, ఆఫ్రికన్ సిద్ధిల చరిత్ర, స్థానిక కథలు అన్నీ కలసి ఉన్నాయన్న మాట.

also read:ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×