E-Paper
Advertisement

ఆ టౌన్ లో ఏ బ్యానర్ పెట్టినా 24 గంటల తర్వాత మాయం.. నిజంగా వండర్!

ఆ టౌన్ లో ఏ బ్యానర్ పెట్టినా 24 గంటల తర్వాత మాయం.. నిజంగా వండర్!
Advertisement

India’s Cleanest Town:  దేశంలో చాలా పట్టణాల్లో రకరకాల బ్యానర్లు, పోస్టర్లు వారాల తరబడి అలాగే కనిపిస్తుంటాయి. కానీ, ఓ పట్టణంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ పెట్టిన బ్యానర్లు ఏవైనా 24 గంటల తర్వాత కనిపించవు. ఆ పట్టణం మరేదో కాదు.. కేరళలోని సుల్తాన్ బతేరి. ఈ పట్టణంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ శుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ పని కాదు. ప్రజల జీవన విధానంలో భాగమైపోయింది. ఎవరైనా ఎక్కడైనా పోస్టర్లు, బ్యానర్లు అతికించినా, అవి రోజులు అలాగే ఉండవు. సంబంధిత అధికారులు వాటిని 24 గంటలు కాగానే  తొలగిస్తారు. నీట్ నెస్ విషయంలో రూల్స్ కఠినంగా ఉండటమే కాదు, వాటిని కచ్చితంగా అమలు చేస్తారు.

24 గంటల పాటు పారిశుద్ధ్య పనులు

ఈ పట్టణంలో పారిశుద్ధ్య పనులు పగలే కాదు, రాత్రిపూట కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక బృందాలు రోడ్లు, వీధులు శుభ్రం చేస్తాయి. పట్టణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. దీని వల్ల ఉదయం లేచే సమయానికి వీధులు చాలా క్లీన్‌గా కనిపిస్తాయి.

నిబంధలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు

Advertisement

ఈ పట్టణంలో పారిశుధ్ధ్య నిబంధనలను పాటించని వారికి  భారీగా జరిమానాలు విధిస్తారు. ఎవరైనా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేసినా, అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు పెట్టినా పెద్ద మొత్తంలో ఫైన్ విధిస్తారు. ఈ కఠిన చర్యల వల్ల ప్రజల్లో బాధ్యతా భావం పెరిగింది. ఎవరూ ఈ నియమాలను ఉల్లంఘించడానికి ప్రయత్నించరు. అక్కడి ప్రజలు కూడా నీట్ నెస్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. తమ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా భావిస్తారు. ఎక్కడైనా చెత్త కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో స్వయంగా శుభ్రం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ కలిసికట్టుగా పనిచేసే మనస్తత్వం వల్లే ఈ పట్టణం ప్రత్యేకంగా మారింది.

ప్రజల సాకారంతో క్లీన్ సిటీ కల సాకారం

శుభ్రత విషయంలో ఈ పట్టణం ఇతర నగరాలకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా పరిశుభ్రత కోసం పెద్ద పెద్ద ప్రచారాలు, ఖర్చులు అవసరం అనుకుంటారు. కానీ, సరైన నియమాలు, కఠిన అమలు, ప్రజల సహకారం ఉంటే చిన్న పట్టణం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదని ఈ టౌన్ నిరూపించింది. ఒక పట్టణం ఎలా మారాలి? ఎలా శుభ్రంగా ఉండాలి? అనే దానికి సుల్తాన్ బతేరీ ఓ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ప్రజల క్రమశిక్షణ, రాత్రిపూట శుభ్రపరిచే విధానం,ఉమ్మడి భాగస్వామ్యం కలిసి ఈ విజయానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి మార్పు అన్ని పట్టణాల్లో కూడా రావాలని అందరూ ఆశిస్తున్నారు.

Advertisement

Read Also: ఇషా అంబానీ వజ్రాల చీర.. 50 మంది కళాకారులు, 1200 గంటల శ్రమతో తయారీ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×