E-Paper
Advertisement

ఆ దేశంలో తాగి పడిపోయే మందుబాబుల చుట్టూ వాటర్ బాటిళ్లు పెడతారు, ఎందుకంటే?

ఆ దేశంలో తాగి పడిపోయే మందుబాబుల చుట్టూ వాటర్ బాటిళ్లు పెడతారు, ఎందుకంటే?
Advertisement

Water Bottles Tradition: పక్కవారు ఏమైపోతే మనకేంటి అనే భావన ఈ రోజుల్లో పెరిగిపోతోంది. తోటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకునేవారు నానాటికి కరువైపోతున్నారు. అయితే కొన్ని దేశాల్లోని సంస్కృతి, అక్కడి ప్రజల ఆలోచనా విధానం మాత్రం.. మానవత్వం ఇంకా బతికే ఉందనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా జపాన్ లో అనుసరిస్తున్న ఓ సంప్రదాయం నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్లుగా తాగి రోడ్డుపై స్పృహలేకుండా పడిపోయిన వారి పట్ల అక్కడి ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

జపాన్ దేశంలో పని ఒత్తిడి, సామాజిక అలవాట్లలో భాగంగా రాత్రి వేళల్లో మద్యం సేవించడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు పరిమితికి మించి తాగడం వల్ల కొందరు వ్యక్తులు స్పృహ తప్పి రైల్వే స్టేషన్లలోనో, ఫుట్‌పాత్‌లపైనో పడిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరైతే వారిని వింతగా చూడటమో లేదా పట్టించుకోకుండా వెళ్లిపోవడమో జరుగుతుంది. కానీ జపాన్ ప్రజలు ఇందుకు భిన్నంగా వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

డీహైడ్రేషన్ బారిన పడకుండా..

Advertisement

రాత్రి వేళల్లో స్పృహతప్పి రోడ్డు పక్కన పడిపోయిన అపరిచితులను చూసినప్పుడు అక్కడి స్థానికులు సరికొత్త సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వారు నిద్ర లేచిన తర్వాత విపరీతమైన డీహైడ్రేషన్, తలనొప్పితో బాధపడతారని గ్రహించి.. వారి తల పక్కన ఒక వాటర్ బాటిల్‌ను లేదా ఎలక్ట్రోలైట్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రింక్ బాటిల్‌ను మెల్లగా ఉంచి వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడ రోడ్డు పక్కన పడిపోయిన వారి చుట్టూ గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున వాటర్ బాటిళ్లు, కూలి డ్రింక్స్ దర్శనమిస్తున్నాయి.

ఓన్లీ సాయం.. నో పబ్లిసిటీ!

అయితే జపనీయులు ఈ సాయానికి ఎలాంటి పబ్లిసిటీని కోరుకోవడం లేదు. వాటర్ బాటిల్ పెట్టే సమయంలో ఫొటోలు తీసుకోవడం, స్పృహతప్పిన వారిని తట్టిలేపి నేనే సాయం చేశానంటూ ప్రగల్భాలు పలకడం వంటివి వారు చేయడం లేదు. సైలెంట్ గా నేలపై వాటర్ బాటిల్స్ పెట్టి ఎలాంటి హడావిడీ లేకుండా వెళ్లిపోతున్నారు. తనకు సాయం చేసిన వ్యక్తి ఎవరనే విషయం కూడా స్పృహ తప్పిన వ్యక్తికి తెలియకుండా నడుచుకుంటున్నారు.

Advertisement

Also Read: గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. చాయ్ తాగే లోపు సిలిండర్ వచ్చేస్తుంది!

జపాన్ సంస్కృతిలో భాగం

తోటి మనుషులకు సాయం చేయాలన్న సంప్రదాయం జపాన్ సంస్కృతిలో అంతర్లీనంగా ఇమిడి ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇతరుల పట్ల దయ, సానుభూతితో జీవించేలా అక్కడి సంప్రదాయాలు ప్రజల్ని ప్రోత్సాహిస్తాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాగి పడిపోయిన వారి వద్ద వాటర్ బాటిల్ పెట్టే సంప్రదాయం పుట్టుకు వచ్చిందని తెలియజేస్తున్నారు. మరోవైపు నిజమైన సాయానికి ప్రచారం అక్కర్లేదని.. మానవత్వం పబ్లిసిటీని కోరుకోదని జపనీయులు నిరూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Also Read: కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×