E-Paper
Advertisement

Unique Food Culture: ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. అక్కడి ప్రజలు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు!

Unique Food Culture: ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. అక్కడి ప్రజలు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు!
Advertisement

Ice Cream Capital of India: మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌ ను వేసవి కాలంలో మాత్రమే ఎక్కువగా తింటారు. కానీ, ఓ నగరంలో ఏడాదంతా తింటూనే ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా కూల్ కూల్ ఐస్ క్రీమ్ లాంగించేస్తారు.  అందుకే, ఆ నగరానికి ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆ నగరం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళూరు: ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా

కర్ణాటకలోని మంగళూరు సిటీని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలకు ఐస్ క్రీమ్ అనేది సాధారణ అలవాటుగా మారిపోయింది. అక్కడ ఐస్ క్రీమ్ అంటే కేవలం డెజర్ట్ కాదు. రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఇక్కడ రాత్రి భోజనం తర్వాత కూడా ఐస్ క్రీమ్ పార్లర్లు కస్టమర్లతో కిక్కిరిసిపోతుంటాయి. వాతావరణం ఎలా ఉన్నా, స్థానికులు ఐస్ క్రీమ్ తినడం ఆపరు. ఫిల్టర్ కాఫీ, ఇతర వంటకాల గురించి మాట్లాడినంత ఈజీగా, ఇక్కడ ప్రజలు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ల గురించి  చర్చిస్తారు.

శతాబ్ద కాలంగా కొనసాగుతున్న ఐస్ క్రీమ్ సంస్కృతి

Advertisement

మంగళూరులో ఐస్ క్రీమ్ సంస్కృతి ఒక రోజులో ఏర్పడలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది.  వలస కాలంలో ఐస్ క్రీమ్ ఇక్కడికి వచ్చింది. కానీ మంగళూరు ప్రజలు దాన్ని తమ జీవితానికి సరిపోయేలా మార్చుకున్నారు. సమీపంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, ఎప్పుడూ చల్లని డెజర్ట్‌ లకు అనుకూలమైన వాతావరణం ఉండటం వంటి కారణాలు దీనికి సాయపడ్డాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఇక్కడ ఐస్ క్రీమ్ వ్యాపారాలు ఎక్కువగా కుటుంబాలే చేస్తాయి. ఖరీదైన ప్రీమియం బ్రాండ్లలా కాకుండా, అందరికీ అందుబాటులో ఉండే ధరలకు మంచి రుచితో ఐస్ క్రీమ్ అందిస్తాయి. ఐస్ క్రీమ్ అనేది ధనికులకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరికీ చేరువైంది.

ఇంకా చెప్పాంటే మంగళూరును ఇతర నగరాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది ఐస్ క్రీమ్ వైవిధ్యం మాత్రమే. ఇక్కడ ఒకే ప్రాంతంలో చాలా ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంటాయి. అంతేకాదు, కొత్త కొత్త ఫ్లేవర్లు కూడా ఉంటాయి. ప్రపంచ ట్రెండ్స్‌ ను ఫాలో అవ్వకుండా, స్థానిక రుచులకు అనుగుణంగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కొన్ని ఐస్ క్రీమ్ లు కూడా ఉన్నాయి. గడ్‌ బడ్ డెజర్ట్ చాలా ఫేమస్. ఇది ఐస్ క్రీమ్, పండ్లు, జెల్లీ, నట్స్ కలిపి లేయర్స్ గా తయారు చేస్తారు.  పర్ఫేలు, పనస పండు, లేత కొబ్బరి ఫ్లేవర్లు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. ఇవి కేవలం పర్యాటకుల కోసమే కాకుండా, స్థానికులు కూడా తింటారు.

ఐస్ క్రీమ్ బ్రాండ్లకు పుట్టినిల్లు

Advertisement

మంగళూరు అనేక ప్రసిద్ధ ఐస్ క్రీమ్ బ్రాండ్లకు పుట్టినిల్లు కూడా. ఐడియల్ ఐస్ క్రీమ్, హాంగ్యో ఐస్ క్రీమ్, ర్యాన్ ఐస్ క్రీమ్ లాంటి బ్రాండ్లు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దక్షిణ భారతం అంతా విస్తరించాయి. మంగళూరు ఐస్ క్రీమ్‌ను ఒక ప్రత్యేక వంటకం నుంచి రోజువారీ అలవాటుగా మార్చిన నగరంగా మారిపోయింది. అందుకే, ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతోంది.

Read Also: ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×