E-Paper
Advertisement

Railway Coaches: రైలు బోగీల మీద ఉండే A,S, E, HA పదాలకు అర్థం ఏంటి? దేని కోసం అలా రాస్తారో తెలుసా?

Railway Coaches: రైలు బోగీల మీద ఉండే A,S, E, HA పదాలకు అర్థం ఏంటి? దేని కోసం అలా రాస్తారో తెలుసా?
Advertisement

Indian Railway Coaches Code Meaning: భారతీయ రైల్వే సంస్థ నిత్యం వేలాది రైళ్లను నడుపుతుంది. కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. అయితే, రైలు ప్రయాణం చేసే సమయంలో ఒక్కో బోగీ మీద ఒక్కో పదం రాసి ఉంటుంది. ఉదాహారణకు  కొన్ని కోచ్ ల మీద D, కొన్ని కోచ్ ల మీద C, మరికొన్ని కోచ్ ల మీద A, B, E, H, HA, S రాసి దాని కింద ఓ నెంబర్ వేస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు రాస్తారు? ఆ పదాల వెనుక ఉన్న ఆర్థం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క్లాసుల వారీగా కోచ్ లకు కోడ్

Advertisement

రైల్లోని ఏ కోచ్ ఏ క్లాస్ కు సంబంధించినదో చెప్పేందుకు ఈ పదాలను వాడుతారు. ఇంతకీ ఏ పదం ఏ కోచ్ ను సూచిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..

⦿ GN: GN అంటే జనరల్ బోగీ. ఇందులో ఎవరైనా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్ కౌంటర్ లో టికెట్ తీసుకుని ఎక్కవచ్చు. అయితే, సీటు దొరుకుతుందనే గ్యారెంటీ లేదు.

Advertisement

⦿ D: ఏదైనా కోచ్ మీద D1, D2, D3 వేసి ఉంటే నాన్ ఏసీ కోచ్ గా భావించాలి. ఈ టికెట్లను కూడా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, సీటు గ్యారంటీగా లభిస్తుంది.

⦿ C: ఇక ఏదైనా కోచ్ మీద C1, C2, C3 వేసి ఉంటే, అది ఏసీ చైర్ కార్ బోగీగా గుర్తించాలి. టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని ఇందులో కూర్చొని ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ E: బోగీ మీద E1, E2, E3 అని ఉంటే.. అది ఎగ్జిక్యుటికవ్ ఏసీ చైర్ కార్ కోచ్ గా గుర్తించాలి. ఇది కాస్త లగ్జరీగా ఉంటుంది.

⦿ S: ఇక S1, S2, S3 అని బోగీల మీద ఉంటే స్లీపర్ క్లాసులుగా గుర్తించాలి. ఇందులో ప్రయాణ సమయంలో పడుకునే అవకాశం ఉంటుంది.

⦿ B: B1, B2, B3 అని బోగీల మీద రాసి ఉంటే థర్డ్ ఏసీ కోచ్ గా గుర్తించాలి.

⦿ A: ఇక A1, A2, A3 ఉంటే సెకెండ్ ఏసీ కోచ్ లు గా తెలుసుకోవాలి.

⦿ H: ఇక ఫస్ట్ ఏసీ కోచ్ లకు H1, H2, H3, HA1m HA2, HA 3 అని రాసి ఉంటుంది. ఈ బోగీలలో ప్రైవేట్ క్యాబిన్లు కూడా ఉంటాయి. లగ్జరీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు సింఫుల్ గా తాము ప్రయాణించే కోచ్ ఏదో గుర్తించేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ కోడ్ లను ఏర్పాటు చేసింది.

Read Also: ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్లాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే!

Read Also: మీ ట్రైన్ టికెట్ పోయిందా? కంగారు పడకండి.. సింఫుల్ గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×