E-Paper
Advertisement

Metro Trains: మెట్రో రైళ్లలో వాటర్ బాటిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?

Metro Trains: మెట్రో రైళ్లలో వాటర్ బాటిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?
Advertisement

మెట్రో ప్రయాణీకులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ బాటిళ్లు, లైటర్లు తీసుకురావద్దని సూచించారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులను ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇకపై భద్రతా తనిఖీలు మరింత కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ తనిఖీలు హైదరాబాద్ లో కాదు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో. ఇటీవల పలు బస్సులకు ఆగంతకులు నిప్పు పెట్టిన నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా సిబ్బంది ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఢాకా మెట్రో స్టేషన్లలో విస్తృత తనిఖీలు

తాజాగా ఢాకా మెట్రో ప్రయాణికుల పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే స్టేషన్లలోకి అనుమతించారు. చాలా మంది ప్రయాణీకుల నుంచి లైటర్లు, వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.  ప్రతి మెట్రో స్టేషన్‌ లో భద్రతను పెంచారు. ఢాకా మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (DMTCL) మేనేజింగ్ డైరెక్టర్ ఫరూక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ తనికీలు కొనసాగాయి. మెట్రో స్టేషన్లలో ప్రయాణీకుల బ్యాక్‌ ప్యాక్‌లు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రత అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ తనిఖీలకు సంబంధించి షేర్ చేసిన ఫోటోల్లో లైటర్లు, వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు కనిపించింది.

జులై తిరుగుబాటు తీర్పు నేపథ్యంలో అలర్ట్

Advertisement

అటు జూలైలో జరిగిన తిరుగుబాటు సందర్భంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువరించే తేదీని ప్రకటించింది. సోమవారం నాడు తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపడుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ IGP (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) చౌదరి అబ్దుల్లా అల్ మామున్ ఉన్నారు. అవామీ లీగ్ ఆన్‌ లైన్ ‘లాక్‌డౌన్’ నేపథ్యంలో జులైలో దేశ వ్యాప్తంగా 17 బస్సులకు నిప్పు పెట్టారని అధికారులు వెల్లడించారు. ఢాకా, దాని పరిసర ప్రాంతాలలో 16 సంఘటనలు జరిగాయన్నారు. మెట్రో రైళ్లలోనూ దాడులకు కొంత మంది కుట్రలు చేశారని అధికారులు వెల్లడించారు.

Read Also: నాలుగు నగరాల్లో భారీ విధ్వంసానికి కుట్ర, ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే?

బంగ్లాదేశ్ రిఫెరెండమ్ కు నిర్ణయం

Advertisement

గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత కొత్త సంస్కరణలను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని ‘జూలై చార్టర్’ పేరుతో అమలు చేయడంపై జాతీయ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ తెలిపారు. ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అవి స్వేచ్ఛగా, న్యాయంగా జరగనున్నట్లు వెల్లడించారు. జూలై చార్టర్ దేశ రాజకీయాలను, సంస్థలను పునర్నిర్మించడానికి, మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ పారిపోవడానికి బలవంతం చేసిన 2024 తిరుగుబాటుకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని యూనస్ తెలిపారు.

Read Also: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×