E-Paper
Advertisement

తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!
Advertisement

Tatkal Booking Tips: తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది అంత ఈజీ కాదనుకుంటారు. బుకింగ్ విండో ఓపెన్ అయిన కాసేపట్లోనే సీట్లు ఫుల్ అయిపోతాయి. ఎక్కువ మందికి వెయిటింగ్ లిస్ట్ టికెట్ రావడం, మరికొంత మందిని టికెట్ దొరకకపోవడం కామన్ గా జరిగే తతంగమే. అయితే, IRCTC ఖాతాలో కొన్ని సెట్టింగ్స్ చేస్తే కన్ఫార్మ్ టిక్కెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ అవేంటంటే..

1.మాస్టర్ లిస్ట్‌ ను ముందుగానే రెడీ చేసుకోండి!  

తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రతి సెకను విలువైనదే. ప్రయాణికుల పేరు, వయస్సు లాంటి వివరాలు టైప్ చేయడానికి టైమ్ వేస్ట్ అవుతుంది. అందుకే IRCTCలో ఉన్న మాస్టర్ లిస్ట్ ఫీచర్‌ను ఉపయోగించడం మంచిది.  దీనికోసం IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి My Account > My Master List ఎంపికలోకి వెళ్లాలి. అక్కడ ప్రయాణికుల వివరాలను ముందుగానే ఎంటర్ సేవ్ చేసుకోవాలి. తర్వాత టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులను కేవలం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.  బుకింగ్ వేగంగా పూర్తవుతుంది.

2.IRCTC ఈ-వాలెట్‌ ను యాక్టివేట్ చేసుకోండి!

Advertisement

తత్కాల్ బుకింగ్ సమయంలో చాలామంది బ్యాంక్ OTP కోసం ఎదురుచూస్తారు. ఫలితంగా సీట్లు అయిపోతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు IRCTC ఈ-వాలెట్ ఉపయోగపడుతుంది. IRCTC వెబ్‌ సైట్, యాప్‌ లో ఈ-వాలెట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కొంత మొత్తాన్ని ముందుగానే జమ చేయాలి. తర్వాత టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపు కోసం ఈ-వాలెట్‌ ను ఎంచుకుంటే OTP అవసరం లేకుండా చెల్లింపు త్వరగా పూర్తవుతుంది. దీంతో బుకింగ్ ఈజీగా సక్సెస్ అవుతుంది.

3.ప్రిఫర్డ్ కోచ్ సెలెక్షన్ ను ఉపయోగించండి!

మీరు అనుకున్న కోచ్‌ లోనే సీటు కావాలనుకుంటే Preferred Coach ID ఫీచర్ ఉపయోగపడుతుంది. రైలు, క్లాస్ ఎంపిక చేసిన తర్వాత ప్రయాణికుల వివరాల పేజీలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ S1, S2, A1, B1 వంటి మీకు కావాల్సిన కోచ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్ మీరు అనుకున్నట్లుగా సీటును కేటాయించే అవకాశం ఉంటుంది.

4.ఆటో అప్‌ గ్రేడ్ ఫీచర్‌ ను ఆన్ చేయండి!

Advertisement

కొన్నిసార్లు తత్కాల్ టికెట్ బుక్ చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో Auto Upgradation ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రయాణికుల వివరాల పేజీలోని Other Preferences విభాగంలో “Consider for Auto Upgradation” అనే ఎంపికను టిక్ చేయాలి. దీని వల్ల ఖాళీలు అందుబాటులోకి వస్తే మీ టికెట్‌ ను ఎగువ తరగతికి అప్‌ గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది.

5.కన్ఫర్మ్ బెర్త్ ఉంటేనే బుక్ అయ్యేలా సెట్టింగ్ పెట్టండి!

తత్కాల్ కోటా పూర్తిగా నిండిపోయినప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్ రావడం సాధారణం. దీనిని నివారించడానికి “Book only if confirmed berths are allotted” అనే ఆప్షన్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ ఆన్‌ లో ఉంటే కన్ఫర్మ్ బెర్త్ అందుబాటులో ఉన్నప్పుడే టికెట్ బుక్ అవుతుంది.

Read Also: ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×