E-Paper
Advertisement

విశాఖ నుంచి తొలి అంతర్జాతీయ క్రూయిజ్‌.. వీసా లేకుండానే విదేశాలకు.. అలలపై 14 రోజుల టూర్..

విశాఖ నుంచి తొలి అంతర్జాతీయ క్రూయిజ్‌.. వీసా లేకుండానే విదేశాలకు.. అలలపై 14 రోజుల టూర్..
Advertisement

Visakhapatnam Cruise Ship: భారత్ లో కూడా క్రూయిజ్ ట్రిప్పులు పెరుగుతున్నాయి. విశాఖ తొలి అంతర్జాతీయ క్రూయిజ్ సర్వీసును ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. జులై 15 నుంచి కార్డెలియా క్రూయిజెస్ విశాఖ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించనుంది. విశాఖను వరల్డ్ క్రూయిజ్ టూరిజంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిపేందుకు ఈ టూర్ సహాయపడుతుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్.. వివిధ దేశాల మీదుగా సాగిపోనుంది. సముద్ర ప్రయాణంలో, సూర్యాస్తమయాలు చూస్తూ.. సాగే సరికొత్త అన్వేషణ అని నిర్వాహకులు తెలిపారు. 14 రోజుల పాటు సాగే ఈ క్రూయిజ్.. భారతీయ ఓడరేవులను ఆగ్నేయాసియాలోని ప్రముఖ ప్రదేశాలతో లింక్ చేస్తుంది.

టూర్ ఇలా!

ఈ క్రూయిజ్ షిప్ విశాఖపట్నంలో ప్రారంభమై, మొదట చెన్నైకి చేరుకుంటుంది. అక్కడ రెండు రోజుల పాటు ఆగుతుంది. టూరిస్టులు విదేశాలకు వెళ్లే ముందు చెన్నై నగరాన్ని అన్వేషించడానికి సమయం ఇస్తుంది. అక్కడి నుంచి షిప్ అంతర్జాతీయ జలాల్లోకి ప్రయాణిస్తూ, ఫూకెట్, లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌ చేరుకుంటుంది. ఈ టూర్ లో షిప్ కొన్ని రోజుల పాటు కీలక ప్రదేశాలలో ప్రయాణిస్తుంది. షిప్ లో విలాసవంతమైన సౌకర్యాలు, తీరప్రాంతాలను అన్వేషించడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి.

ఈ క్రూయిజ్‌ ప్రత్యేకతలు

Advertisement

ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. విజయమోహన్, పర్యాటక అధికారులు, టూరిస్ట్ సంస్థల చొరవ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో భాగంగా ఈ క్రూయిజ్ ను ప్రారంభించనున్నారు. భారతీయ ప్రయాణికులకు అంతర్జాతీయ క్రూయిజ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రూయిజ్‌ టూరిస్టులకు థాయ్‌లాండ్, మలేషియా వీసా అవసరం లేదు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత వీసా ఇస్తారు. కనీసం ఆరు నెలల చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంటే సరిపోతుంది.

ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రూయిజ్‌లు ముఖ్యంగా ముంబై లేదా అంతర్జాతీయ ఓడరేవుల నుంచి బయలుదేరుతున్నాయి. విశాఖను కూడా అంతర్జాతీయ క్రూయిజ్ లో భాగం చేసేందుకు.. అలాగే ఈస్ట్, సౌత్ ఇండియా టూరిస్టులకు వరల్డ్ క్రూయిజ్ ప్రయాణాన్ని అందించేందుకు ఈ ట్రిప్ ఉపయోగపడుతుంది. విశాఖ క్రూయిజ్ తో భారతీయ క్రూయిజ్ పర్యాటకం మరింత విస్తరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Also Read: ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న భారతీయ ప్రదేశాలు ఇవి, వేసవి సెలవుల్లో చూసేయండి

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×